Wed. Jan 21st, 2026

    Trisha Krishnan: ఈ మధ్య బాగా వైరల్ అయిన విషయాలలో ఒకటి ‘యానిమల్’ సినిమా రెండు త్రిష-మన్సూర్ అలీ వివాదం. ఈ రెండు సోషల్ మీడియాను ఊపేశాయి. చివరికీ త్రిష-మన్సూర్ అలీ వివాదం సద్దుమణిగినట్టే అనిపిస్తోంది. ఇంతలోనే మళ్ళీ ఓ పోస్ట్ పెట్టి నెటిజన్స్ కి పలహారం అయింది త్రిష కృష్ణన్. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రన్‌బీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా తెరకెక్కి పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన సినిమా ‘యానిమల్’.

    ఈ సినిమాకి డివైడ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ పరంగా మాత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ బద్దలయ్యాయి. ఊహించని మాజిక్ ఫిగర్ వసూళ్ళు ‘యానిమల్’ మూవీ రాబట్టింది. అటు నార్త్ లో ఇటు సౌత్ లో సినీ ప్రముఖులందరూ ‘యానిమల్’ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో త్రిష కూడా తన ఇన్‌స్టాలో ‘యానిమల్’ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టి మళ్ళీ కాసేపటికి డిలీట్ చేసింది.

    trisha-krishnan- Why did Trisha delete her Instagram post about 'Animal'?
    trisha-krishnan- Why did Trisha delete her Instagram post about ‘Animal’?

    Trisha Krishnan: అదే ఇప్పుడు త్రిషకి తిప్పలు తెచ్చిపెట్టింది. 

    అదే ఇప్పుడు త్రిషకి తిప్పలు తెచ్చిపెట్టింది. ఈ మూవీ ఓ కల్ట్ మువీ అని అభిప్రాయపడ్డ త్రిష మేకర్స్ ని అభినందిస్తూ స్మైలీ ఏమోజీలను పెట్టింది. మళ్ళీ కాసేపట్లోనే ఆ పోస్ట్ ని డిలీట్ చేసింది. దీనిపై నెటిజన్స్ మండిపడుతున్నారు. ఈ సినిమా బావుందని పోస్ట్ పెట్టి మళ్ళీ ఎందుకు డిలీట్ చేసినట్టు అంటూ త్రిషను ప్రశ్నిస్తున్నారు. మరి ఎందుకు త్రిష ఈ పోస్ట్ డిలీట్ చేసిందనే విషయం క్లారిటీ లేదు.

    బహుషా ఇలాంటి కల్ట్ మూవీని ప్రశంసించినందుకు ట్రోల్స్ వస్తాయని భయపడిందేమో అని కొందరు అంటున్నారు. కాగా, ఇటీవల తమిళంలో విజయ్ సరసన నటించిన ‘లియో’ సినిమాతో మంచి హిట్ అందుకుంది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ సినిమాలలో నటించే అవకాశాలున్నాయని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.