Wed. Jan 21st, 2026

    Tollywood: మిల్కీ బ్యూటీ తమన్నా అందం ఏమాత్రం తరగడం లేదు. హీరోయిన్‌గా ఇండస్ట్రీకొచ్చి 18 ఏళ్ళు కావస్తుంది. ఇప్పటికే యంగ్ హీరోలతో పాటు సీనియర్ హీరోలతోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది. ఐటం సాంగ్స్ లోనూ తమన్నా కి తిరుగు లేదు. ఇంటర్‌నేషనల్ బ్రాండ్స్ ని ప్రమోట్ చేయడంలో కూడా తమన్నా టాలెంటే వేరు. తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీలో తమన్నా ఒకప్పుడు నంబర్ 1 హీరోయిన్.

    తమన్నా కెరీర్ ప్రారంభం అయినప్పటి నుంచీ ఇప్పటివరకూ ఎక్కడా కాంట్రవర్సీలకి ఛాన్స్ ఇవ్వలేదు. అందరితోనూ సఖ్యతగా ఉంటూ వస్తోంది. ఆ మధ్య ఓ టీవీ షో విషయంలో చిన్న ఇబ్బందులు ఎదుర్కున్నదే గానీ, ఇండస్ట్రీ పరంగా మాత్రం తమన్నాని అందరూ తమదిగా భావిస్తున్నారు. రాజమౌళి వంటి అగ్ర దర్శకుడు కూడా తమన్నా అంటే మంచి అభిప్రాయాన్ని వెలుబుచ్చారు. దర్శకనిర్మాతలతో గానీ, హీరోలతో గానీ గొడవలు పెట్టుకుంది లేదు.

    tollywood-Does Tamannaah demand so much for bold scenes?
    tollywood-Does Tamannaah demand so much for bold scenes?

    Tollywood: ఇంటిమేట్ సీన్స్ చేయడానికి తమన్నా అదనంగా రెమ్యునరేషన్

    సోషల్ మీడియాలోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక్కడ కూడా తమన్నాకి విపరీతమైన ఆదరణ ఉంది. అయితే, ఇప్పుడు పోటీ బాగా ఎక్కువైంది. అదీ కాక సినిమాల కంటే వెబ్ సిరీస్ హవా ఎక్కువగా ఉంది. కాబట్టే ఇక్కడ వచ్చే రెమ్యునరేషన్ కూడా బాగా ఉంటోంది. తమన్నా కూడా ఈ మధ్య సినిమాల కంటే ఎక్కువగా వెబ్ సిరీస్ చేయడానికి ఆసక్తి చూపిస్తోంది. సినిమాలో కంటే వెబ్ సిరీస్ లో తమన్నా చేసిన ఇంటిమేట్ సీన్స్ ప్రేక్షకులను అల్లాడించాయి.

    tollywood-Does Tamannaah demand so much for bold scenes?
    tollywood-Does Tamannaah demand so much for bold scenes?

    ఇలాంటి ఇంటిమేట్ సీన్స్ చేయడానికి తమన్నా అదనంగా రెమ్యునరేషన్ తీసుకుంటుందనే టాక్ ఇప్పుడు బాగా వినిపిస్తోంది. ఇలాంటి సీన్స్ చేయాలంటే ఇప్పటి వరకూ ఉన్న క్రేజ్ ని కూడా పట్టించుకోకూడదు. అభిమానుల్లో వచ్చే టాక్ కూడా పక్కన పెట్టాలి. మళ్ళీ తమన్నా అంటే అంతటి పేరు ఉంటుందా లేదా అనేది ఆలోచించకూడదు. లిప్ కిస్సులు, బెడ్రూం సీన్స్ చూసిన తమన్నా మీద ప్రేక్షకుల్లో అభిప్రాయమూ మారవచ్చు. ఇన్ని తట్టుకోవాలంటే ఏదో ఒక ప్రతిఫలం అయితే ఉండాలి. అందుకే, తమన్నా వెబ్ సిరీస్ లో బోల్డ్ సీన్స్ ఉంటే కాస్త ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుందట.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.