Tollywood Cinema : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోయిన్స్ తో ఎంత డీసెంట్ గా ప్రవర్తిస్తారో చాలా మంది ఆయనతో నటించిన వారు చెప్పారు. ఆయన మామూలుగానే సిగ్గరి. కెరీర్ ప్రారంభంలో హీరోయిన్ వచ్చి పక్కన కూర్చున్నా పెద్దగా మాట్లాడింది లేదట. మెల్లగా అమ్మాయిలతో కలవడం అలవాటు చేసుకున్నారు. ఇక ఆయన సినిమాలో హీరోయిన్ గా నటించిన వారికి ఇంటి భోజనం తినిపించి సంతోషపడతారు.
హీరోయిన్స్ కి మాత్రమే కాదు, సినిమా యూనిట్ సభ్యులందరికీ ప్రభాస్ ఇంటి భోజనం పెట్టిన సందర్భాలెన్నో ఉన్నాయి. డార్లింగ్ సరసన నటించిన వారు ఆయన గొప్పతనం గురించి ఎన్నో విధాలుగా చెబుతుంటారు. అంత సున్నితంగా ఉండే ప్రభాస్ కి పూజా హెగ్డే కోపం తెప్పించిన సందర్భం కూడా ఒకటి ఉంది. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధే శ్యామ్ వచ్చింది. పాన్ ఇండియన్ లెవల్ లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన సక్సెస్ అందుకోలేకపోయింది.
ఈ సినిమా కోసం యూవీ వారు బాగానే ఖర్చు పెట్టారు. బాలీవుడ్ నిర్మాణ సంస్థ కూడా భాగస్వామ్యంలో ఉంది. మొత్తానికి భారీ నష్టాలనే మిగిల్చింది రాధే శ్యామ్. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో పూజా హెగ్డే మేకర్స్ కి సహకరించలేదని అప్పట్లో బాగా ప్రచారం జరిగింది. ఫారిన్ లో ప్లాన్ చేసిన ఓ షెడ్యూల్ కూడా క్యాన్సిల్ కావడానికి కారణం పూజా అని వార్తలు వచ్చాయి. ఆ షెడ్యూల్ క్యాన్సిల్ అవడంతో నిర్మాతలకి కొన్ని కోట్ల వరకు నష్టం కూడా వచ్చిందట.
అయినా కూడా పూజా హెగ్డేని భరించారని, అయితే సినిమా ప్రమోషన్స్ లో మాత్రం అంతగా సహకరించలేదని, ఈ విషయంలో అడిగితే ప్రభాస్ ని కూడా లెక్క చేయలేదని ఇండస్ట్రీ వర్గాలలో టాక్ వినిపించింది. దాంతో ఈ విషయం టాలీవుడ్ అంతా పాకిపోయి..మళ్ళీ కొత్త సినిమాలలో పూజాకి ఛాన్స్ ఇవ్వాలంటే నిర్మాతలు లైట్ తీసుకుంటున్నారట. ప్రభాస్ లాంటి మంచి నటుడితో పెట్టుకుంటే మళ్ళీ టాలీవుడ్‌లో ఛాన్సులు వస్తాయా..? అంటూ అటు ఫ్యాన్స్ ఇటు మేకర్స్ అంటున్నారట. చూస్తుంటే మళ్ళీ పూజా తెలుగులో మునుపటి లీడ్ కాకపోవచ్చు అనిపిస్తోంది.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.