Tollywood: అప్పట్లో ఎన్.టి.ఆర్ ఇప్పుడు చిరంజీవి..దెబ్బకే ఆస్తులమ్ముకున్న నిర్మాతలు..? అంటూ తాజాగా ఫిల్మ్ సర్కిల్స్ లో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. చిత్ర పరిశ్రమలో హిట్స్, ఫ్లాప్స్ అనేవి సహజం. ఒక సినిమా ఫ్లాపవడానికి ఎన్ని కారణాలుంటాయో హిట్ అవడానికీ అన్నే కారణాలుంటాయి. నిర్మాత గనక అన్నీ దగ్గరుండి చూసుకుంటే నష్టాలనేవి జరగవు. వేరే వ్యాపకాల మీద దృష్ఠి పెట్టి అసలు విషయం మర్చిపోతే మాత్రం నష్టాలు తప్పవు.
కథ అనుకున్నప్పుడే ఎంత బడ్జెట్ లో తీయాలి, ఏ హీరోని పెట్టుకోవాలి..కథలోని పాత్రకి స్టార్ హీరోయిన్ అవసరమా లేదా లాంటి ప్రతీ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక్కడ హీరోయిన్ విషయంలో కక్కుర్తి పడ్డా, బంధుత్వాన్ని వెనకేసుకొచ్చినా సినిమా ఫ్లాప్ కి కారణాలవుతాయి. గతంలో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా బి.గోపాల్ దర్శకత్వంలో ‘నరసింహుడు’ అనే సినిమా వచ్చింది. ఈ చిత్రాన్ని చెంగల వెంకట్రావు భారీ బడ్జెట్‌తో నిర్మించారు.
Tollywood: చిరు హీరోగా కంటే ఏజ్ కి తగ్గ పాత్రలు ఎంచుకోవడం బెటర్
అంతకముందు నందమూరి బాలకృష్ణతో ‘సమరసింహారెడ్డి’ చిత్రాన్ని నిర్మించి ఊహించని లాభాలను మూటగట్టుకున్నారు. అయితే, ‘నరసింహుడు ‘మాత్రం డిజాస్టర్ అయింది. దాంతో నిర్మాత వెళ్ళి హుస్సేన్ సాగర్‌లో దూకేశాడు. వెంటనే ఎన్.టి.ఆర్ స్పందించి తన రెమ్యునరేషన్ తిరిగిచ్చేశారు. ఆ సమయంలో తారక్ అనవసరంగా మాటలు పడ్డారు. ఇప్పుడు కూడా మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘భోళా శంకర్’ నిర్మాత అనిల్ సుంకర కి భారీ నష్టాలను మిగిల్చింది.
ఈ సినిమాను ప్రకటించినప్పటించే అందరిలో ఎన్నో సందేహాలు మొదలయ్యాయి. ఫేడవుట్ అయిపోయిన దర్శకుడు మెహర్ రమేశ్ కి చిరు ఛాన్స్ ఇవ్వడం ఏంటీ అని..? బంధువు కాబట్టి, సినిమా అంటే ప్రాణం కాబట్టి మెహర్ కి మెగాస్టార్ ఛాన్స్ ఇచ్చారు. కానీ, నిర్మాత ఏకంగా ఆస్తులు అమ్ముకునేంతగా నష్టాలు వస్తాయని మాత్రం ఊహించలేదు. చిరంజీవి, తమన్నా, కీర్తి సురేశ్ లాంటి అగ్ర తారలున్నా ‘భోళా శంకర్’ డిజాస్టర్ అవడం పట్ల ఇండస్ట్రీలో చాలా మంది నెగిటివ్ కామెంట్స్ చేశారు. కొందరైతే చిరు హీరోగా కంటే ఏజ్ కి తగ్గ పాత్రలు ఎంచుకోవడం బెటర్ అని సలహాలిస్తున్నారు.