Tollywood : దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు దగ్గర అసోసియేట్‌గా పనిచేసిన రాజమౌళి స్టూడెంట్ నంబర్ 1 సినిమాతో దర్శకుడిగా మారాడు. ఈ సినిమా తర్వాత సింహాద్రి చిత్రాన్ని తెరకెక్కించి స్టార్ డైరెక్టర్‌గా మారాడు. ఒక్కో సినిమాతో తన రేంజ్ మార్కెట్ ని అమాంతం పెంచుకుంటూ వచ్చారు. ఇప్పుడు మన తెలుగు సినిమా ప్రపంచ స్థాయిలో నిలబడిందీ అంటే అది ఈ దర్శక ధీరుడి వల్లే. తెలుగు సినిమా ఇండస్ట్రీకి పాన్ ఇండియా క్రేజ్ తెచ్చిన దర్శకుడు.
అయితే, రాజమౌళి మన టాలీవుడ్ స్టార్స్ ని కాకుండా బాలీవుడ్ స్టార్స్ తో కూడా సినిమాలు చేయాలనుకున్నారు. కానీ, రాజమౌళి సినిమాలను వారు రిజెక్ట్ చేశారు. అలా చేసిన వారిలో మన స్టార్స్ పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణ ఉన్నారు. వారే కాదు, బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో పెద్ద స్టార్స్ కూడా ఉన్నారు. రాజమౌళి దర్శకత్వంలో ఎన్.టి.ఆర్ నటించిన సింహాద్రి సినిమా ముందు బాలయ్య అనుకున్నారు. కానీ, కథ బాలయ్యకి నచ్చకపోవడంతో అది తారక్ వద్దకి వచ్చింది.
Tollywood : బాహుబలి సినిమాలో తమిళ స్టార్ హీరో సూర్య కూడా నటించాల్సి ఉంది.
ఇక మాస్ మహారాజ రవితేజ డ్యూయల్ రోల్ లో నటించిన విక్రమార్కుడు సినిమా కథ పవన్ కళ్యాణ్ కోసం అనుకున్నారు రాజమౌళి. కానీ, ఇద్దరికి టైమింగ్ సెట్ అవక రవితేజ ఖాతాలో పడింది. ఇక యమదొంగ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించాల్సింది. కుదరక ప్రియమణి చేసింది. అతిలోక సుందరి శ్రీదేవి బాహుబలి సిరీస్‌లలో రమ్యకృష్ణ చేసిన శివగామి పాత్ర చేయాల్సి ఉండగా పలు కారణాల వల్ల రమ్యకృష్ణ చేసి తిరుగులేని స్టార్ డం సంపాదించుకుంది. ఇదే పాత్ర మంచు లక్ష్మీ మిస్ అయింది.
అంతేకాదు, ఇదే బాహుబలి సినిమాలో తమిళ స్టార్ హీరో సూర్య కూడా నటించాల్సి ఉంది. కానీ, ఆయనకి డేట్స్ కుదరక మిస్ చేసుకున్నారు. బాలీవుడ్ క్రేజీ యాక్టర్ వివేక్ ఓబెరాయ్ కూడా బాహుబలి సినిమాను మిస్ చేసుకున్నారు. ఇందులో రానా దగ్గుబాటి పోషించిన భళ్ళాలదేవ పాత్రకి ముందు వివేక్ ని అనుకున్నారు జక్కన్న. కానీ, ఫైనల్‌గా ఆ పాత్ర రానా దక్కించుకున్నారు. అద్భుతంగా చేసి మంచి ఇమేజ్ ని తెచ్చుకున్నారు. ఇక ఇందులో సత్యరాజ్ పోషించిన కట్టప్ప పాత్రకి గాను, మోహన్ లాల్, మోహన్ బాబులతో పాటు బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ని కూడా రాజమౌళి అనుకున్నారు. సత్యరాజ్ ఫైనల్ అయ్యారు.
ఇక బాహుబలి సినిమాలో ప్రధాన పాత్ర అయిన బాహుబలి ప్రభాస్ కాకుండా బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ చేయాల్సింది. కానీ, కుదరలేదు. అలాగే జాన్ అబ్రహం కూడా భళ్ళాల పాత్ర వదులుకున్నవారిలో ఉన్నారు. ఒకదశలో సింహాద్రి సినిమాను ప్రభాస్ తో కూడా చేయాలనుకున్నారు రాజమౌళి. అంతేకాదు, మెగా పవర్ స్టార్ రాం చరణ్ నటించిన రెండవ సినిమా మగధీర బాలయ్య చేయాల్సింది. పలు కారణాల వల్ల కుదరలేదు. అలాగే ఇందులో అర్చన నటించాల్సి ఉండగా మిస్ చేసుకుంది.
ఇక రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీలో ఓలివియా మోరీస్ నటించిన పాత్రకి బాలీవుడ్ బ్యూటీస్ శ్రద్ధకపూర్, కత్రినా చెల్లిని, అమీ జాక్సన్ ని, పరిణీతి చోప్రాలను అనుకున్నారు. ఫైనల్ గా ఆ రోల్ ఓలొవియా దక్కించుకుంది. ఇలా పలువురు స్టార్ మన దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి రూపొందించగా బాకాసాఫీస్ వద్ద భారీ విజయాలను అందుకున్న సినిమాలను మిస్ చేసుకున్నారు. అనుకున్నట్టుగా గనక వారు రాజమౌళి సినిమాలలో నటిస్తే ఖచ్చితంగా వచ్చే క్రేజ్ మరో రేంజ్ అని చెప్పాలి.