Chandrayaan 3 : జాబిల్లిపై విజయవంతంగా కాలుమోపిన ల్యాండర్, రోవర్ ఇంకా నిద్రవస్థలోనే ఉన్నాయి. చంద్రుడిపై సన్ లైట్ రావడంతో స్లీప్ మోడ్లో ఉన్న విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ను తిరిగి యాక్టివేట్ చేసేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే సూర్యోదయం అయ్యి 48 గంటలు గడుస్తున్నా అవి యాక్టీవ్ కాలేదు. వాటి నుంచి ఎలాంటి సిగ్నల్స్ రాలేదు.

2019లో చైనా దేశానికి చెందిన ల్యాండర్ చాంగ్ – 4, రోవర్ యుటు – 2లను సన్ లైట్ వచ్చిన తర్వాత మళ్ళీ యాక్టివేట్ చేసినట్లు స్పేస్ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం మన ల్యాండర్, రోవర్ లు దక్షిణ ధ్రువం వద్ద ఉన్నవి. అయితే అక్కడ పరిస్థితులు వేరుగా ఉంటాయని , నైట్ సమయంలో అక్కడి టెంపరేచర్ -250 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోతుందని చెబుతున్నారు. అక్కడి వాతావరణం దృష్ట్యా ల్యాండర్, రోవర్ తిరిగి యాక్టీవ్ అవ్వడం కష్టమని పలువురు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

చందమామపై రాత్రి కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు ఈ నెల 3న విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ లను నిద్రవస్థలోకి పంపించింది. స్లీప్ మోడ్ లోకి వెళ్లే ముందే ల్యాండర్, రోవర్ తమ వర్క్ కంప్లీట్ చేశాయి. ఇప్పుడు సైంటిస్టుల కృషితో ల్యాండర్, రోవర్ తిరిగి వర్క్ చేస్తే చందమామపై చంద్రయాన్-3 ప్రయోగాలకు బోనస్ వచ్చినట్లే.
ఇస్రో జులై 14న చంద్రయాన్ 3 ప్రయోగాన్ని చేపట్టింది. అగస్ట్ 23న విక్రమ్ ల్యాండర్ చంద్రడిపై స్మూత్ గా ల్యాండ్ అయ్యింది. ఈ ప్రయోగంతో జాబిల్లి దక్షిణ ధ్రువంపైన కాలుమోపిన మొదటి దేశంగా ఇస్రో భారత్ పతకాన్ని ఎగురవేసింది. చంద్రుడిపై ల్యాండ్ అయిన ల్యాండర్ లోని రోవర్ బయటకు వచ్చి తమ పనిని కంప్లీట్ చేశాయి. ఇక జాబిల్లిపై రాత్రి కావడంతో విక్రమ్ రోవర్, ల్యాండర్ నిద్రవస్థలోకి వెళ్లిపోయాయి. అయితే విక్రమ్, ప్రజ్ఞాన్తో తిరిగి సంబంధాలు పునరుద్దరించే ప్రక్రియ కొనసాగుతుందని ఇస్రో స్పష్టం చేసింది.