Categories: LatestNews

Today Horoscope : బంధువులు వస్తున్నారా..ఈ రాశుల వారు తస్మాత్ జాగ్రత్త

Today Horoscope : ఆదివారం 19-03-2023 రోజున 12 రాశులలో ఏ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది. ఎవరికి ఈ రోజు కలిసి వస్తుంది. ఎవరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ఎలాంటి కార్యక్రమాలు చేప్పటవచ్చు వంటి వివరాలను ఇప్పుడు చూద్దాం.
today-horoscope-sunday-19-03-2023
మేషం :
ఈరోజు ఈ రాశి వారు ఆర్థిక లాభం పొందే అవకాశాల మెండుగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సమాజంలో వీరి కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి అదేవిధంగా బంధుమిత్రుల తో సంతోషంగా గడుపుతారు వారితో ఉల్లాసంగా ఉంటారు. గతంలో ఏదైతే మీ ఉద్యోగానికి సంబంధించిన మార్పులు చేర్పులు జరుగుతున్నట్లయితే, తిరిగి మీరు మీ పొజిషన్ కి చేరుకోగలుగుతారు. మీరు ధర్మాన్ని అనుసరిస్తారు మనస్పూర్తిగా ఏ పని చేపట్టినా అది వెంటనే ఫలితాన్ని అందిస్తుంది. ఈ రాశి వారు ఈ రోజు సంకటహర గణపతి స్తోత్రం చదివితే బాగుంటుంది.
వృషభం :
ఈ రాశి వారికి శుభయోగాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఏ రంగమైన సరే మీరు అద్భుతమైన విజయాలు సాధిస్తారు. మీరు ఆత్మ శుద్ధితో మనస్ఫూర్తిగా చేసే ఏ పనైనా సరే అందులో విజయం సాధిస్తారు. స్థిరమైన నిర్ణయాలు మీ ఎదుగుదలకు దారులను చూపిస్తాయి. మీకు సహాయం సహకారాలు అందించే వారి సంఖ్యా పెరుగుతుంది మిమ్మల్ని అభిమానించేవారు పెరుగుతారు. ఈ రాశి వారు ప్రస్తుతం ప్రశాంతమైన జీవితాన్ని అనుభవిస్తారు. తరచూ నిర్ణయాలు మార్చడం వల్ల కాస్త ఇబ్బందులు ఎదురవుతాయి .ముఖ్యంగా మీరు బంధుమిత్రులతో ప్రేమగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రాశి వారు ఈ రోజు ఆంజనేయ ఆరాధన చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు.
మిథునం :
ధర్మదారిలో వెళ్లాలన్న ఆలోచనతో ఈ రాశి వారు ఎప్పుడూ ఉంటారు. ముఖ్యంగా కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో విజయాలు సాధిస్తారు. శారీరక శ్రమ పెరుగుతుంది ఒత్తిడి పెరుగుతుంది అయినప్పటికీ మీరు పట్టుదలతో మీ పనులను పూర్తి చేసుకుంటారు. మీ బుద్ధి బలంతో మీరు మీ ఆర్థిక అభివృద్ధికి బాటలు వేసుకుంటారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అధికారులు మీకు అప్పగించిన బాధ్యతలను కూడా నూటికి నూరు శాతం పూర్తి చేస్తారు. ఎలాంటి ఆటంకాలు ఉన్నా కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్తారు. ముఖ్యంగా వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆదిత్య హృదయ చదవడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు.
కర్కాటకం :
ఉద్యోగస్తులకు ఈ రాశిలో శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి.ఆర్థిక పరిస్థితి కూడా కాస్త మెరుగెయ్యి అవకాశాలు ఉన్నాయి. మీరు ఏ పని చేపట్టినా నిర్మలమైన మనసుతో చిత్తశుద్ధితో చేస్తే అందులో ఫలితాలను పొందగలుగుతారు. మీరు నిర్ణయించుకున్న మీ లక్ష్యాలను చేరుకోగలుగుతారు. ముఖ్యంగా బంధుమిత్రుల సహాయ సహకారాలు తీసుకుంటే అవి మీకు ముఖ్య విషయాల్లో బాగా మేలు చేస్తాయి. ఈ రాశి వారు ఈ రోజు శుభకార్యాలలో పాల్గొంటారు.కుటుంబ సభ్యులతో సంతోషకరంగా గడుపుతారు.వెంకటేశ్వర స్వామిని పూజించడం చెప్పదగిన సూచన.
సింహం :
ఈ రాశి వారు బంధుమిత్రులతో ఈరోజు సంతోషంగా గడుపుతారు. కానీ కాస్త వారివల్ల ఖర్చులు అధికమయ్యే అవకాశాలు ఉన్నాయి.కాబట్టి కాస్త జాగ్రత్తగా చేసుకోండి. మీరు చేపట్టే కీలకమైన పనుల్లో పెద్దవారి సలహాలు సూచనలు ఉపకరిస్తాయి. ఇదంతా కూడా మీకు శుభాకాలం. మనసుపెట్టి పనిచేస్తే అందులో విజయం సాధిస్తారు. ఎలాంటి ఆటంకాలు ఏర్పడిన వాటిని ఆదిగమించి ముందుకు వెళ్తారు. బుద్ధి బలం బాగా పనిచేస్తుంది. మీక ఆరోగ్యం సహకరిస్తుంది ధనయోగం కూడా ఉంది. ఈ రాశి వారు ఈ రోజు కనకధార స్తోత్రం చదవడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు.
కన్య :
కన్య రాశి వారికి ఈ రోజు శుభంగా ఉంది ఆత్మవిశ్వాసంతో పని చేస్తే మంచి ఫలితాలను సాధించగలుగుతారు ముఖ్యంగా ఆత్మీయుల సలహాలు తీసుకోవడం చెప్పదగిన సూచన. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉండాలి ఎవరితోనూ వాదోపవాదలకు దిగకపోవడం మంచిది. అనవసరమైన విషయాల గురించి ఏమాత్రం ఆలోచించకండి. గణపతిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.
తుల :
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా మనోబలంతో ముందుకు వెళ్తేనే విజయాలు సాధించగలుగుతారు. మీరు చేసే పనుల్లో కూడా మనోబలం తగ్గకుండా చూసుకోవాలి ధైర్యంగా ముందుకు వెళ్లాలి. కుటుంబ సభ్యుల సహకారం మీకు అవసరమై ఉంటుంది. కొన్ని సంఘటనలు మీకు బాధను కలిగిస్తాయి అనవసరమైన ఖర్చులు కూడా మీరు చేయాల్సి వస్తుంది. మానసిక ప్రశాంతత కోసం గణపతి స్తోత్రం చదవండి మంచి జరుగుతుంది.
వృశ్చికం :
ఏదైనా సరే వస్తుందిలే అని అనుకోకూడదు మీ ప్రయత్నం తప్పనిసరి ఉండాలి. ప్రయత్నిస్తేనే మీరు అనుకున్న గమ్యానికి కరెక్ట్ గా చేరుకోగలుగుతారు. ఒక విషయంలో మీకు ఆర్థిక సాయం అందుతుంది. అనుకున్న పనులను అనుకున్నట్లుగానే చేయగలుగుతారు. మీ మీ రంగాల్లో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగమైన వ్యాపారమైన ప్రోత్సాహకరమైన వాతావరణం ఏర్పడుతుంది. శుభకార్యలో పాల్గొంటారు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. బిల్వాష్టకం చదవడం వల్ల ఉత్తమమైన ఫలితాలను పొందగలుగుతారు.
ధనుస్సు :
ఈ రాశి వారికి కుటుంబ సభ్యుల సహకారం ఎల్లప్పుడూ అందుతుంది. కొన్ని కొన్ని కీలకమైన విషయాల్లో వారే వీరికి వెన్నుదండుగా నిలుస్తారు. వారి సహకారం వల్ల ఎన్నో ఉత్తమమైన ఫలితాలను పొందుతారు. అవసరానికి తగిన సహకారం లభిస్తుంది. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మీ బంధుమిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ఇక మీ ఇంట్లో ఒక శుభవార్త మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. సూర్యాష్టకం చదివితే మంచి ఫలితాలను పొందవచ్చు.
మకరం :
ఈ రాశి వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉత్సాహంగా ముందుకు సాగితేనే ప్రయాణం కొనసాగుతుంది. ఆశ్రమ చంద్రదోషం ఉంది కాబట్టి మనోబలం చాలా అవసరం. దుర్గా స్తోత్రశతనామావలి చదివితే మంచి ఫలితాలను పొందవచ్చు.
కుంభం :
ఈ రాశి వారికి అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. బంధుమిత్రులతో కలహాలు ఏర్పడే అవకాశం ఉంది వీలైనంతవరకు కలహాలకు దూరంగానే ఉండడం మంచిది ఉద్యోగంలో శ్రమ అధికంగా ఉంటుంది కనీసం కు తగిన ఫలితాలను మీరు పొందగలుగుతారు. ఈ రాశి వారు శని శ్లోకం చదివితే మంచి ఫలితాలను పొందుతారు.
మీనం :
మీరు ఏ పని చేసినా ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది. ఓర్పుతో ముందుకు సాగాల్సి ఉంటుంది ఆర్థికంగా కొంతవరకు అనుకూలంగానే ఉన్నప్పటికీ కూడా ఆటంకాలు కూడా అదే విధంగా పెరుగుతాయి కాబట్టి ముందు చూపుతో వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మీరే పని ప్రారంభించినా కాస్త ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి అవి అలా కొనసాగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. బంధుమిత్రులతో జాగ్రత్తలు అవసరం దుర్గాదేవిని పూజించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

ALLU ARJUN: AA22 టైటిల్ “రాకా”..ఇది ఎవరూ ఊహించనిది!

ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…

6 days ago

Ram Charan: ‘పెద్ది’ కథకి స్పూర్తి ఆమిర్ ఖాన్ సినిమాలేనా?

Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…

1 week ago

Chiranjeevi: విశ్వంభర మరింత ఆలస్యం..ఆ సినిమాలా అవుతుందా?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…

1 week ago

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…

1 week ago

Peddi Movie: పెద్ది రిలీజ్ విషయంలో రామ్ చరణ్ చెప్పినా నమ్మని ఫ్యాన్స్!?

Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…

1 week ago

Carmeni Selvam (2026) – Movie Review: కార్మేని సెల్వం బ్యూటిఫుల్ ఎమోషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్‌తో సాగిన చక్కటి కుటుంబకథా చిత్రం

Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…

2 weeks ago

This website uses cookies.