Janhvi Kapoor : బాలీవుడ్ బ్యూటీ నటి జాన్వీ కపూర్ జూనియర్ ఎన్టీఆర్‌తో మొదటిసారిగా తెలుగు సినిమాలో నటించినబోతోంది. ఈ సందర్భంగా జాన్వీ తన తెలుగు సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. జాన్వి నటించబోతున్న ఈ సినిమాకి తాత్కాలికంగా ఎన్టీఆర్ 30 అని పేరు పెట్టారు. జాన్వీ ఎన్టీఆర్ తో కలిసి పని చేయడం నా కళ అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు ఇటీవల ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డును పొందిన RRR చిత్రాన్ని తిరిగి చూశానని, జాన్వి తెలిపింది.
జాన్వీ కపూర్, జూనియర్ ఎన్టీఆర్‌ల చిత్రం యాక్షన్ చిత్రంగా ప్రచారం జరుగుతోంది. ఇది తెలుగు చిత్ర పరిశ్రమలో జాన్వీ తొలి చిత్రం. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆమె తన పుట్టినరోజు సందర్భంగా రాబోయే తెలుగు చిత్రం యొక్క మొదటి పోస్టర్‌ను షేర్ చేసి రీసెంట్ గా ఈ న్యూస్ ను కన్ఫర్మ్ చేసింది.
ఇండియా టుడే కాన్‌క్లేవ్ 2023లో జాన్వీ కపూర్ మాట్లాడుతూ..“అక్షరాలా రోజులను లెక్కిస్తున్నాను. డైరెక్టర్‌కి రోజూ మెసేజ్ చేస్తాను. జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి పనిచేయడం ఒక కల. నేను ఇటీవల RRRని మళ్లీ చూశాను. ఎన్టీఆర్ కు ఉన్న ను తేజస్సు సూపర్ . అతనితో స్క్రీన్ స్పేస్‌ను పంచుకోవడం నా జీవితంలో అతిపెద్ద సంతోషాలలో ఒకటి ”
ఎన్టీఆర్ తో కలిసి నటించాలని నేను ప్రతిరోజూ ప్రార్థించాను. ప్రతి ఇంటర్వ్యూలో ఎన్టీఆర్‌తో వర్క్ చేయాలనుకుంటున్నాను అని చెప్పాను. నాకు తెలుగులో పని చేయడం ఇదే మొదటిసారి కావచ్చు. మీరు నా పై విశ్వాసం ఉంచుతారని ఆశిస్తున్నాను “అని పేర్కొంది.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.