Mosquitoes: వర్షాకాలం మొదలైంది అంటే చాలు మన చుట్టూ పరిసర ప్రాంతాలలో పిచ్చిపిచ్చి మొక్కలు పెరగడం నీళ్లు నిలువ ఉంటే కనుక పెద్ద ఎత్తున దోమలు వృద్ధి చెందుతాయి. ఇలా దోమలు వృద్ధి చెందడంతో ఇంట్లోకి వచ్చి దోమకాటుకు మనం గురి కావాల్సి ఉంటుంది. ఇలా దోమ కాటుకు గురికావడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు మనల్ని వెంటాడుతుంటాయి. అయితే ఈ సమస్యల నుంచి బయటపడాలి అంటే ముందుగా మనం దోమలను అరికట్టాల్సి ఉంటుంది. మరి దోమలను అరికట్టడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే విషయానికి వస్తే…
బంతి పువ్వు మొక్క నుంచి ఘాటు వాసన వేద జల్లుతుంది. ఇలా ఘాటు వాసన కలిగినటువంటి బంతి పువ్వు మొక్క మన ఇంటి ఆవరణంలో ఉండటం వల్ల దోమలు ఎలాంటి పరిస్థితులలోను ఇంట్లోకి రావు అలాగే గుర్రపుడెక్క మొక్కను కూడా ఇంట్లో పెంచడం వల్ల దోమలను పూర్తిగా అరికట్టవచ్చు. ఈ మొక్క యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ వంటి లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ మొక్క నుంచి కూడా ఒక లాంటి ఘాటు వాసన వస్తుంది.
ఇక వేపలో కూడా ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి సాయంత్రం అయ్యే సమయానికి కాస్త వేప పొగ ఇంట్లో వేయడం వల్ల దోమలు ఇంట్లోకి రాకుండా ఇంట్లో ఉన్నటువంటి దోమలు కూడా బయటకు వెళ్లిపోతాయి. ఇంటి ఆవరణంలో తులసి మొక్క ఉండటం వల్ల దోమలను పూర్తిగా నియంత్రించవచ్చు. ఇక ఇంట్లో బిర్యాని ఆకులను ఒక మూల పెట్టి వెలిగించడం వల్ల వాటి పొగకు కూడా ఇంట్లో ఉన్నటువంటి దోమలన్నీ బయటకు వెళ్లిపోతాయి. ఇలా ఈ చిన్న చిట్కాలతో దోమల బెడద నుంచి మనం తప్పించుకోవచ్చు.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.