Devotional Tips: సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంపదలతో ఆనందంతో ఉండాలని కోరుకుంటారు. ఇలా సంపద కలగడం కోసం ప్రతి ఒక్కరు ఎన్నో రకాల వాస్తు పరిహారాలను పాటిస్తూ ఉంటారు. ఇలా పాటించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉండి సిరిసంపదలు కలుగుతాయని భావిస్తారు. అయితే సిరిసంపదలు కలగాలి అంటే ఈ చిన్న పరిహారం పాటించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంటుందని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా మహిళలు ఈ పరిహారం పాటించడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలతో పాటు ఆయురారోగ్యాలతో ఉంటారని చెప్పాలి.
అన్నం వండటానికి ముందు మహిళలు బియ్యం శుభ్రం చేసుకుంటారు అయితే ఈ బియ్యం కడగటానికి ముందుగా మనం వండడానికి తీసుకున్నటువంటి వాటిలో ఒక గుప్పెడు బియ్యం తీసుకొని మన ఇష్ట దైవాన్ని మనసులో తలుచుకొని ఆ గుప్పెడు బియ్యం ఒక గిన్నెలో వేసి పెట్టుకోవాలి. 15 రోజులకి లేదా నెలరోజులకు ఒకసారి మనం ప్రతిరోజు తీస్తున్నటువంటి ఆ గుప్పెడు బియ్యం ఎవరైతే ఆకలితో అలమటిస్తూ ఉంటారు అలాంటి పేదవారికి దానం చేయాలి.
ఇలా ఆకలితో ఉన్నటువంటి పేదవారికి మనం ప్రతిరోజు తీసిపెట్టే గుప్పెడు బియ్యం దానంగా ఇవ్వడం వల్ల అన్నపూర్ణ దేవి అనుగ్రహం మనపై ఉండడమే కాకుండా లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తూ మనకు సిరిసంపదలను కలిగిస్తారు. ఇలా దానాలు చేసిన వారికి దోష నివారణ జరిగి జీవితంలో సకల శుభాలు, ఆనందాలు లభిస్తాయి.అలాగే కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి. ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోయి.ఆర్థిక అభివృద్ధి కలుగుతుందని, కుటుంబ సభ్యులందరూ కూడా సుఖసంతోషాలతో ఉంటారని పండితులు చెబుతున్నారు.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.