Lord Hanuman: మన హిందూ సంప్రదాయాల ప్రకారం వారంలో ప్రతిరోజు ఒక్కో దేవుడికి అంకితం ఇవ్వబడింది. ఇక మంగళవారం హనుమంతుడిని పూజించడం వల్ల పనులలో ఏర్పడిన ఆటంకాలు తొలగిపోతాయని ప్రతి విషయంలో ధైర్య సాహసాలతో ముందడుగు వేస్తారని భావిస్తారు. అందుకే మంగళవారం ఆంజనేయ స్వామికి ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు. అయితే అప్పులతో బాధపడేవారు, ఆర్థికంగా ఎదుగుదల కోరుకునేవారు, ఇంట్లో ప్రశాంతతను కోరుకునేవారు మంగళవారం నాడు ఆంజనేయస్వామికి బెల్లంతో చిన్న పరిహారం చేయటం వల్ల వారి ఇబ్బందులు తొలిగిపోయి సుఖసంతోషాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. మరి మంగళవారం హనుమంతుడి పూజలో పాటించాల్సిన పరిహారాలు ఏంటి అనే విషయానికి వస్తే..
మంగళవారం నాడు ఉదయమే నిద్ర లేచి కాషాయ రంగు దుస్తులను ధరించి ఆంజనేయస్వామి చిత్రపటాన్ని శుభ్ర పరిచి ఎర్రటి పుష్పాలతో అలంకరించుకోవాలి. స్వామి వారి పూజలో భాగంగా హనుమాన్ చాలీసా చదవాలి అయితే స్వామికి నైవేద్యంగా బెల్లం సమర్పించాలి. అప్పులతో బాధపడే వారు ఎవరికీ తెలియకుండా మంగళవారం స్వామివారికి బెల్లం నైవేద్యంగా సమర్పించడం వల్ల అప్పుల బాధలు తొలగిపోతాయి. ఇక దగ్గర్లో ఉన్న ఆంజనేయస్వామి ఆలయంలో బెల్లం, శనగలను స్వామివారికి సమర్పించి కొంత ప్రసాదంగా తీసుకొని అనంతరం వాటిని దానం చేయటం వల్ల అప్పుల బాధల నుంచి విముక్తి పొందుతారు. ఇలా 11 వారాలు చేయటం వల్ల అప్పుల సమస్య నుంచి బయట పడతారు.
ఇక జీవితంలో ఆర్థిక ఎదుగుదలను కోరుకునేవారు చిన్న ఎర్రటి వస్త్రంలో కొద్దిగా బెల్లం, ఒక రాగి నాణెం పెట్టి మూటగా కట్టాలి. ఈ మూటను స్వామి వారి పాదాల వద్ద ఉంచి పూజ చేయాలి . మరుసటి రోజు ఈ మూటను మనం డబ్బు దాచే చోట పెట్టడం వల్ల ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. మంగళవారం కుజ గ్రహానికి అధిపతి బెల్లం కుజ గ్రహానికి ప్రతీక కావడంతో బెల్లంతో ఈ పరిహారాలు చేయటం వల్ల అనుకున్నవి జరుగుతాయి. ఇంట్లో మానసిక ప్రశాంతత లేకపోవడం కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఉంటే మంగళవారం సాయంత్రం హనుమంతుడికి బెల్లంతో పాటు కొత్తిమీరను సమర్పించడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి గొడవలు తొలగిపోయి సుఖసంతోషాలు వెల్లువేరుస్తాయని పండితులు చెబుతున్నారు.
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…
Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…
This website uses cookies.