Categories: HealthLatestNews

Hair Fall: వర్షాకాలంలో జుట్టు ఎక్కువగా రాలిపోతోందా.. ఈ తప్పు మాత్రం చెయ్యొద్దు?

Hair Fall: వర్షాకాలం మొదలవడంతో ఎన్నో రకాల జబ్బులు కూడా వెంటాడుతూ ఉంటాయి. అయితే వర్షాకాలంలోనే చాలామంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతూ ఉంటారు. వేసవికాలంలో అయితే అధిక చమట డాండ్రఫ్ కారణంగా అధికంగా జుట్టు రాలిపోతుంది కానీ వర్షాకాలంలో కూడా చాలామందిని ఇదే సమస్య వెంటాడుతూ ఉంది. ఇలా వర్షాకాలంలో కూడా జుట్టు రాలడానికి కారణం ఏంటి అనే విషయాన్న వస్తే..వర్షం పడుతున్నప్పుడు చాలామందికి వర్షంలో తడవడం ఇష్టంగా ఉంటుంది. ఇలా వర్షంలో తడవడం వల్ల జుట్టు రాలిపోతుందని నిపుణులు చెబుతున్నారు.

వర్షంలో తడవడం వల్ల జుట్టు రాలిపోతుంది అంటే వర్షపు నీరు కారణం కాదు. వర్షంలో తడిసిన తర్వాత జుట్టును సరిగా ఆరబెట్టకపోవడం వల్ల అసలు సమస్య మొదలవుతుందని నిపుణులు చెబుతున్నారు. వర్షాకాలంలో గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలోనే మన జుట్టును సరిగా ఆరనివ్వకపోతే దుమ్ము ధూళికణాలు మన తలపై పేరుకుపోయి చుండ్రు ఏర్పడటానికి కారణం అవుతుంది. తద్వారా తల చర్మ ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిని జుట్టు కుదుళ్ళు బలహీన పడటం వల్ల జుట్టు అధికంగా రాలిపోతుంది. పట్టణాలలో పడే వర్షంలో ఆమ్లస్వభావం కాస్త ఎక్కువగా ఉంటుంది.

Hair Fall during mansoon season know the main cause of rain fall

Hair Fall: ఫంగల్ ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం..

ఇలాంటి నీరు తల చర్మంపై ఎక్కువసేపు ఉంటే తల చర్మం pH సమతుల్యత దెబ్బతినవచ్చు. దురద, చుండ్రు సమస్యలు, ఫంగల్ ఇన్ఫెక్షన్ వంటివి ఎక్కువగా సోకే అవకాశాలు ఉంటాయి. ఇకపై జుట్టు రాలే సమస్య ఉండకూడదు అంటే వర్షంలో తడిసినప్పటికీ జుట్టును శుభ్రంగా ఆరబెట్టుకోవాలి. తక్కువ గాఢత కలిగిన షాంపుతో స్నానం చేయడం, జుట్టుకు కండీషనర్ వాడటం వల్ల జుట్టు బలహీన పడకుండా ఉంటుంది. వర్షాకాలంలో బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా గొడుగు లేదా రైన్ కోట్ వంటి వాటిని ఉపయోగించడం మంచిది. వర్షంలో తడిసి వచ్చిన తర్వాత పొరపాటున కూడా టవల్ తో జుట్టును బిగుతుగా కట్టి ఆరనివ్వకూడదు. వీలైనంతవరకు స్నానం చేసి జుట్టును శుభ్రంగా ఆరబెట్టుకోవడం వల్ల జుట్టు రాలే సమస్య నుంచి బయటపడవచ్చు.

Sravani

Recent Posts

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

2 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

2 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

2 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

3 weeks ago

Lord Shiva: కోరిన కోరికలు తీరడం లేదా.. శివాలయంలో ఈ పరిహారం చేస్తే చాలు!

Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…

3 weeks ago

Climbing Stairs: మెట్లు ఎక్కుతూ అలసిపోతున్నారా? ఫిట్ నెస్ లోపం అనుకుంటే పొరపాటే?

Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…

3 weeks ago

This website uses cookies.