Health Tips: వర్షాకాలం మొదలవడంతో తరచూ వానలు పడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఎన్నో రకాల సమస్యలు కూడా మనల్ని వెంటాడుతూ ఉంటాయి ముఖ్యంగా వర్షాకాలంలో దగ్గు జలుబు వంటి సమస్యలు తొందరగా వస్తూ ఉంటాయి. అయితే ఈ దగ్గు జలుబు సమస్య అనేది ఎన్ని మందులు వాడిన తగ్గదు. అయితే మందులు ఉపయోగించిన దగ్గు జలుబు తగ్గలేదు అంటే మన ఈ చిట్కాలను కనుక పాటిస్తే వెంటనే ఉపశమనం పొందవచ్చు.
మరి వర్షాకాలంలో వచ్చే దగ్గు జలుబు సమస్య నుంచి ఉపశమనం పొందాలి అంటే ఎలాంటి చిట్కాలను పాటించాలి అనే విషయానికి వస్తే.. ముందుగా మూడు వెల్లుల్లి రెబ్బలను తీసుకొని పొట్టు తీయకుండా కచ్చాపచ్చాగా దంచి పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. వాటర్ హీట్ అయ్యాక దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను అందులో వేసుకోవాలి.
వీటితో పాటు రెండు లెమన్ స్లైసెస్ వేసుకొని 10 నుంచి 12 నిమిషాల పాటు మరిగించాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి. ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ స్వచ్ఛమైన తేనెను కలిపి గోరువెచ్చగా ఉన్న సమయంలో తాగటం వల్ల దగ్గు జలుబు వంటి సమస్య నుంచి తొందరగా ఉపశమనం పొందగలము తద్వారా శ్వాస తీసుకోవడానికి కూడా తేలికగా అవుతుంది. వెల్లుల్లి తేనే నిమ్మకాయలు ఎన్నో యాంటీబయోటిక్ గుణాలు ఉంటాయి కనుక ఇవి ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి ఎంతగానో దోహదం చేస్తాయి.