Health Tips: సాధారణంగా వృద్ధాప్యంలో వచ్చే కంటి సమస్యలు ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ అతి చిన్న వయస్సులోనే ఎదుర్కొంటున్నారు. కంటి సమస్యలు తలెత్తడానికి కారణాలను పరిశీలిస్తే పోషకాహార లోపం ప్రధాన కారణమని చెప్పొచ్చు ముఖ్యంగా మనం తీసుకునే ఆహారంలో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ డి, బీటా కెరోటిన్, ఒమేగా 3 ఫ్యాటి ఆమ్లాలు లోపించడమే. మరియు ఈ రోజుల్లో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు గంటల తరబడి మొబైల్స్, కంప్యూటర్స్ చూడడం వల్ల వీటి నుంచి వెలుపడే ప్రమాదకర నీలి కిరణాలు కంటి చూపుకు అవసరమైన రెటీనా పై తీవ్ర ప్రభావం చూపిస్తోందని అనేక సర్వేలో వెల్లడింది.
కళ్ళు సున్నితమైన అవయవాలు వీటి విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా చిన్నపిల్లలను స్మార్ట్ ఫోన్ కు దూరంగా ఉంచడం మంచిది. అలాగే రోజువారి ఆహారంలో విటమిన్ ఏ సమృద్ధిగా కలిగిన క్యారెట్ జ్యూస్ ను సేవిస్తే కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. కంటి సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు పాలకూర జ్యూస్ సేవిస్తే ఇందులో ఉండే విటమిన్ ఏ, యాంటీ ఆక్సిడెంట్లు కంటి చూపును మెరుగు పరుస్తాయి.పాలకూర లో ఉన్న బీటా కెరోటిన్ కళ్లపై అతినీలలోహిత కిరణాల ప్రభావాన్ని తగ్గించి కంటి ఆరోగ్యాన్ని రక్షిస్తుంది.
ప్రతిరోజు ఉసరి రసాన్ని సేవిస్తే ఇందులో ఉండే విటమిన్ సి వ్యాధి నిరోధక శక్తిని పెంచడంతోపాటు కంటి సమస్యలను తొలగిస్తుంది. ముఖ్యంగా గుడ్డు, చేపల్లో విరివిగా లభించే విటమిన్ ఏ, ఈ ఒమేగా-3 ఫాటీ ఆమ్లం అనేక కంటి సమస్యలను నయం చేసి రెటీనా పనితీరును మెరుగుపరుస్తుంది.బ్లూ బెర్రీ లో పుష్కలంగా లభించే యాంథోసైనిన్స్ ఆమ్లం, విటమిన్-సి కళ్ళు పొడిబారడం, రే చీకటి వంటి సమస్యలను తొలగించి కంటిచూపును మెరుగుపరుస్తుంది.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.