Devotional facts: మన హిందూ సంప్రదాయాల ప్రకారం ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఆ దేవుడిని స్మరించుకుంటూ పెద్ద ఎత్తున పూజ కార్యక్రమాలను చేస్తూ ఉంటాము ఇలా స్వామివారికి పూజలు చేయడం వల్ల స్వామివారి అనుగ్రహం మనపై ఉండే విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయని ప్రతి ఒక్కరు భావిస్తారు. ఈ క్రమంలోనే చాలామంది ఉదయం పూజ చేసి దీపాలను వెలిగిస్తూ ఉంటారు అయితే ఈ దీపాలను వెలిగించడానికి ఒక్కొక్క నూనె ఉపయోగిస్తుంటారు కొందరు ఆముదం ఉపయోగించిన మరికొందరు నువ్వుల నూనె ఉపయోగిస్తూ ఉంటారు.
ఇలా దీపపు కుందలలో మనం నూనె వేసి దీపాలను వెలిగిస్తుంటాము అయితే కొన్నిసార్లు మనం కుందులలో వేసినటువంటి వత్తులు మొత్తం పూర్తిగా కాలిపోయి ఉంటాయి ఇలా కాలిపోవడానికి గల కారణం ఏంటి కాలిపోవడం వెనక ఏదైనా కారణం ఉందా కాలిపోతే ఏం జరుగుతుందనే విషయానికి వస్తే… ఇలా మీరు వెలిగించినటువంటి ఒత్తి పూర్తిగా కనుక కాలిపోతే మీకు అదృష్ట యోగం రాబోతుందని అర్థం. అలాగే వత్తి వేరువేరుగా విడిపోయి పువ్వు లాగా కాలిపోతే ఎంతో మంచి కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
ఈ విధంగా దీపపు కుందలలో వేసినటువంటి వత్తి పూర్తిగా కనుక కాలిపోతే మీరు కోరుకున్నటువంటి కోరికలను దేవుడు విన్నారని ఆయన చెంతకు మీ మొర వెళ్ళిందని అర్థం. ఇంట్లో దీపారాధన చేసినప్పుడు పువ్వకారం వచ్చింది అంటే మాత్రం కచ్చితంగా మీ పూజ ఆ దేవుడు స్వీకరిస్తున్నాడని అర్థం. ఇలా మనం ఇంట్లో దీపారాధన చేసే సమయంలో తప్పనిసరిగా ఎన్నో జాగ్రత్తలను తీసుకోవాలని ముఖ్యంగా నియమనిష్ఠలతో ఈ పూజా కార్యక్రమాలను చేయటం దేవుడి ఆశీస్సులు మనపై ఉంటాయి.