Tue. Mar 3rd, 2026

    Risk Foods In Periods: మహిళలు ప్రతినెల నెలసరి సమస్యతో ఎంతో బాధపడుతూ ఉంటారు ఇలా నెలసరి కారణంగా చాలామంది ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటారు. ఈ సమస్యల కారణంగా కనీసం గది నుంచి బయటకు రావడానికి కూడా ఇష్టపడరు అలాగే మరికొందరు తీవ్రమైనటువంటి పొత్తి కడుపునొప్పి నడుము నొప్పి వంటి సమస్యలతో కూడా బాధపడుతూ ఉంటారు. ఇలా ప్రతి నెల మహిళలు నెలసరి సమయంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. ఇలా నెలసరి నొప్పులతో బాధపడేవారు పొరపాటున కూడా పీరియడ్స్ టైం లో కొన్ని ఆహార పదార్థాలను తినకూడదని నిపుణులు చెబుతున్నారు.

    these-are-the-foods-that-should-not-be-eaten-during-periods
    these-are-the-foods-that-should-not-be-eaten-during-periods

    పీరియడ్స్ టైం లో చాలామంది కడుపునొప్పి వంటి సమస్య నుంచి ఉపశమనం పొందటానికి ఎక్కువగా కాఫీ టీ తాగుతూ ఉంటారు అయితే నెలసరి సమయంలో ఈ కాఫీ టీ ఎక్కువగా తాగకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇలా తీసుకోవడం కారణంగా మానసిక ఆందోళన పెరుగుతుంది. అంతే కాకుండా పొట్ట నొప్పి కూడా వస్తుంది. నెలసరి సమయంలో కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాలు తినడం వల్ల.. స్త్రీ జననేంద్రియాలకు సమస్యలు వస్తాయి. వీటి కారణంగా పొత్తి కడుపులో నొప్పి, జీర్ణ క్రియ సమస్యలు వంటివి వస్తాయి.

    ఇక పీరియడ్స్ టైం లో మధ్యపానానికి కూడా దూరంగా ఉండటం మంచిది. అలాగే చక్కెర ఎక్కువగా ఉండే ప్రాసెస్ చేసిన ఆహారాలకు కూడా దూరంగా ఉండాలి. వీటి కారణంగా.. బ్లడ్ లో షుగర్ లెవల్స్ పెరగడం జరుగుతుంది. పాలు బలమని కొంత మంది పీరియడ్స్ లో తాగుతూ ఉంటారు. పాలలో లాక్టోస్, అరాకిడోనిక్ అనే ఆమ్లం ఉంటుంది. దీని కారణంగా ఇది పొట్ట ఉబ్బరాన్ని పెంచడమే కాకుండా కడుపు నొప్పి రావడానికి కూడా కారణం అవుతుంది కనుక పీరియడ్స్ టైం లో మహిళలు ఈ ఆహార పదార్థాలను తీసుకోకపోవడం మంచిది.