Running: సాధారణంగా మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకునే పనులలో భాగంగా పెద్ద ఎత్తున వాకింగ్ చేస్తూ అలాగే రన్నింగ్ చేస్తూ ఉంటాము. మరికొందరు జిమ్ వెళ్లి వర్కౌట్స్ చేస్తూ ఉంటారు. ఇలా వర్కౌట్స్ చేయటం వల్ల ఆరోగ్యంగా ఉండడమే కాకుండా మన శరీరం ఫిట్నెస్ కలిగి ఉంటుందని భావిస్తూ ఉంటారు. అంటే ఇలాంటి వర్కౌట్స్ చేయడం కంటే రోజు 10 నిమిషాల పాటు పరిగెడితే మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ప్రతిరోజు ఒక పది నిమిషాల పాటు పరుగులు పెట్టడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయట మరి ఆ ప్రయోజనాలు ఏంటి అనే విషయాన్ని వస్తే..రన్నింగ్ లేదా జాగింగ్ ఒక గొప్ప కార్డియో వర్కవుట్‌గా చెబుతారు. ప్రతిరోజు 10 నిమిషాల పాటు రన్నింగ్ చేయడం వల్ల గుండె సమస్యలు వచ్చే అవకాశాలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.
క్రమం తప్పకుండా ఇలా పరిగెడుతూ ఉండేవారిలో 50 శాతం వరకు గుండె జబ్బులు తగ్గే అవకాశాలు ఉన్నాయని పలు పరిశోధనలలో వెల్లడయింది. రన్నింగ్ మీ హృదయ స్పందన రేటును తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మీ హృదయ స్పందన తక్కువగా ఉంటే, మీ గుండె ఆరోగ్యంగా పని చేస్తుందని అర్థం.రన్నింగ్ వంటి ఏరోబిక్ వ్యాయామం ఎండార్ఫిన్స్ అనే రసాయనాలను విడుదల చేస్తుంది. ఇవి మీ మెదడును చురుకుగా ఉంచుతాయి. నిద్రలేమిని దూరం చేస్తాయి. ఇక జ్ఞాపక శక్తిని పెంచడంలో కూడా రన్నింగ్ ఎంతగానో దోహదం చేస్తుందని చెప్పాలి.