The Kerala Story: ది కేరళ స్టొరీ ఇప్పుడు దేశంలో మోస్ట్ హాట్ టాపిక్ అని చెప్పాలి. హార్ట్ ఎటాక్ ఫేమ్ ఆదాశర్మ ఈ సినిమాలో లీడ్ రోల్ లో నటించింది. హిందీలో తెరకెక్కిన ఈ సినిమా లవ్ జిహాద్ కాన్సెప్ట్ తో ఉంటుంది. కేరళ రాష్ట్రంలో ముస్లిం యువకులు హిందూ అమ్మాయిలని ప్రేమ పేరుతో వలలో వేసుకొని తరువాత వారిని ఐఎస్ఐఎస్ వంటి తీవ్రవాద సంస్థలకి ఎలా అమ్మేస్తున్నారు అనే ఎలిమెంట్ ని ఈ చిత్రంలో ఆవిష్కరించారు. రియల్ లైఫ్ సంఘటనలని బేస్ చేసుకొని ఈ కథని తెరకెక్కించారు. ఈ సినిమా ఆరంభం నుంచి వివాదాలతోనే నడుస్తోంది. కల్పిత అంశాలని నిజమని నమ్మించే ప్రయత్నం ది కేరళ స్టొరీ మూవీ ద్వారా జరుగుతుందని ముస్లిం సంఘాల వాదన.
అందుకే ఈ సినిమాపై వారు మొదటి నుంచి అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ముస్లిం మైనారిటీ సంఘాల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తున్న కూడా ఈ చిత్రానికి కేంద్రంలోని బీజేపీ పార్టీ అండదండలు ఉండటంతో థియేటర్స్ లో రిలీజ్ చేశారు. అయితే రిలీజ్ తర్వాత అన్ని న్యూస్ వెబ్ సైట్స్ ని 1½ రేటింగ్స్ ఇచ్చిన కూడా ఒక వర్గం ప్రేక్షకులు మాత్రం సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. మూడు రోజుల్లోనే ఏకంగా 35 కోట్లకి పైగా ఈ సినిమా కలెక్ట్ చేసింది అంటే ఏ స్థాయిలో ఆదరణ వస్తుందో అర్ధం చేసుకోవచ్చు. నిజంగా జరిగిన సంఘటనలని ధైర్యంగా ఈ చిత్రంలో తెరపై చూపించారని హిందుత్వ వర్గాలు మద్దతుగా నిలుస్తున్నాయి.
హిందూ యువత నుంచి విశేషమైన ఆదరణ వస్తోంది. కేరళలో జరిగిన లవ్ జిహాద్ సంఘటనల గురించి తెలిసిన వారు ది కేరళ స్టొరీ చిత్రంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే మైనారిటీ ముస్లిం సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతూ ఉండటం, తీవ్ర స్థాయిలో ఆందోళనలు జరుగుతూ ఉండటంతో తమిళనాడు, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలలో మూవీపై నిషేధం విధించారు. మరో వైపు కొద్ది రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ది కేరళ స్టొరీపై ప్రశంసలు కురిపించారు. తాజాగా బెంగుళూరులో జేపీ నడ్డా ఈ మూవీ చూడటమే కాకుండా ప్రశంసలు కురిపించడం విశేషం. ఇప్పుడు కర్ణాటక ఎన్నికలలో కూడా ది కేరళ స్టొరీ మూవీ ఇంపాక్ట్ బీజేపీని అనుకూలంగా మారుతుందని అందరూ భావిస్తున్నారు.