Categories: Tips

Health: ఒక్క సిగరెట్ తో  30 సెకండ్స్ ఆయుష్షు పెంచుకోవచ్చు… ఎలానో తెలుసా?

Health: ప్రస్తుతం సమాజంలో సాంకేతిక ఓ వైపు అభివృద్ధిలో పరుగులు పెడుతూ ఉంటే అంతే స్థాయిలో మనుషుల జీవితాలు, ప్రాణాలతో చెలగాటం ఆడే డ్రగ్స్ కల్చర్ పెరిగిపోతుంది. మనిషి వ్యసనాల మీద వ్యాపారాలు చేసే వారి సంఖ్య కూడా పెరిగిపోయింది. ఓ వైపు సిగరెట్, మద్యం ప్రత్యక్షంగా జరుగుతూ ఉంటే పరోక్షంగా డ్రగ్స్ దందా నడుస్తుంది. ఈ వ్యసనాల కారణంగా సమాజంలో ఎన్ని ఘోరాలు జరుగుతున్న వాటిని కంట్రోల్ చేయడంలో మాత్రం ప్రభుత్వాలు సక్సెస్ కావడం లేదు.

అలాగే ప్రజలు కూడా వ్యసనాల బారి నుంచి బయటపడలేకపోతున్నారు. ముఖ్యంగా సిగరెట్ ఎంత ప్రాణాంతకమో తెలిసి కూడా చాలా మంది దానికి బానిసై క్యాన్సర్, గుండె సంబంధిత రోగాల బారిన పడుతున్నారు. సిగరెట్ వలన జరిగే ఘోరాలపై ఓ వైపు అవగాహన కల్పిస్తున్నా కూడా ప్రజలు వాటి నుంచి దూరం కాలేకపోతున్నారు.

ఈ మధ్యకాలంలో ఆడవాళ్లు కూడా సిగరెట్ తాగడం అలవాటుగా చేసుకున్నారు. సిగరెట్  ని చాలా మంది స్టేటస్ గా ఫీల్ అవుతూ ఉంటారు. ఆ సిగరెట్ ప్రతిక్షణం వాళ్ళ ఆయుష్షు ఎంత తగ్గిస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేయరు. ఏదైనా రోగం వచ్చి హాస్పిటల్ లో పడ్డప్పుడు కాని వాస్తవం బోధపడదు. ప్రపంచవ్యాప్తంగా సిగరెట్ ద్వారా పొగాకు తాగేవారి సంఖ్య మిలియన్స్ లో ఉందటే అతిశయోక్తి కాదు.

అదే సమయంలో ఈ సిగరెట్ పొగ కారణంగా ప్రతి సంవత్సరం చనిపోయే వారు, హాస్పిటల్ లో చేరేవారు కూడా అధికంగానే ఉన్నారు. దేశంలో 29 శాతం మంది యువత సిగరెట్ కి బానిసలుగా మారిపోయారని సర్వేలు చెబుతున్నాయి. సిగరెట్ తాగేవారి ఆరోగ్యంతో పాటు వారి కారణంగా చుట్టూ ఉండి ఆ పొగ పీల్చేవారు కూడా అనారోగ్యాల బారిన పడుతున్నారు. పొగాకు తాగే వారు ఎక్కువగా క్యాన్సర్ బారిన పడుతున్నారు.

తరువాత గుండె, ఊపిరితిత్తుల సమస్యలతో సతమతం అయ్యేవారు కూడా ఉన్నారు. ఇదిలా ఒక్క సిగరెట్ త్రాగడం మానేస్తే మన ఆయుష్షులో 30 సెకండ్స్ కాలాన్ని పొడిగించుకోవచ్చని  పరిశోధకులు చెబుతున్నారు. సిగరెట్ తాగేవారి తమ ఆయుష్షుని ప్రతి సిగరెట్ పై 30 సెకండ్స్ తగ్గించుకుంటున్నారని దీనిని బట్టి తెలుస్తుంది.

 

 

Varalakshmi

Recent Posts

Gut Health: రాత్రి తిన్న వెంటనే బెడ్ ఎక్కుతున్నారా… ఇబ్బందులలో పడినట్టే?

Gut Health: సాధారణంగా మనం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతీ రోజు వ్యాయామం చేయటం ఎంతో మంచిదే అయితే ఇది ఉరుకుల…

16 hours ago

Lord Shiva: 100 శివరాత్రులకు సమానమైన సోమవారం.. శివయ్యని ఇలా పూజిస్తే చాలు..

Lord Shiva: సాధారణంగా మన హిందూ సంప్రదాయాల ప్రకారం ప్రతిరోజు ఒక దేవుడికి అంకితం చేయబడి ఆ రోజున ఆ…

18 hours ago

AP POLITICS: టీడీపీలో ఉన్న ‘ఆ’ పవర్ జనసేనలో కరువైందా..?

AP POLITICS: రాజకీయాల్లో వ్యూహాలు ఎంత ముఖ్యమో.. ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టే కౌంటర్ అటాక్ కూడా అంతే ముఖ్యం. ప్రస్తుతం…

3 days ago

Telangana: కాంగ్రెస్‌లో అసంతృప్తి.. రేవంత్‌కు కొండా త‌ల‌నొప్పి..!

Telangana: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతర్గత సెగలు మళ్లీ మొదలయ్యాయి. పాలనపై పట్టు పెంచుకునే పనిలో ఉన్న సీఎం రేవంత్…

4 days ago

AP POLITICS: భూమా వ‌ర్సెస్ గంగుల‌.. ఆళ్లగడ్డలో హెయిర్ పాలిటిక్స్‌..!

AP POLITICS: ఆళ్లగడ్డ అనగానే ఒకప్పుడు ఫ్యాక్షన్ పాలిటిక్స్ గుర్తొచ్చేవి. కానీ, ఇప్పుడు అక్కడ రూట్ మారింది. సరికొత్తగా ‘హెయిర్…

4 days ago

AP NEWS: మోదీ మెచ్చిన ఫ్యామిలీ.. ఇప్పుడు జ‌న‌సేన‌లోకి..!

AP NEWS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీ సరికొత్త ఊపుతో దూసుకుపోతోంది. సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయం తర్వాత, డిప్యూటీ…

4 days ago

This website uses cookies.