Thambulam: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం తాంబూలం ఇవ్వడం అనేది చాలా సాంప్రదాయంగా వస్తున్నటువంటి ఆచారం మన ఇంటికి ఎవరైనా ముత్తైదువులు వస్తే వారు వెళ్లేటప్పుడువారికి తాంబూలం ఇవ్వడం చేస్తుంటాము అలాగే ఏదైనా పూజ కార్యక్రమాలు సమయంలోను శుభకార్యాల సమయంలోను వ్రతాలు చేసేటప్పుడు కూడా ఇంటికి వచ్చిన అతిథులకు తాంబూలం ఇస్తుంటాము ఇలా తాంబూలం ఇచ్చే సమయంలో ఎలా పడితే అలా ఇవ్వకూడదని, తాంబూలం విషయంలో కూడా కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుందని పండితులు చెబుతున్నారు.
ముందుగా శుభ్రంగా మూడు తమలపాకులను కడిగి తీసుకోవాలి వాటిని తొడిమెలతో సహా ఉంచాలి. వాటిలో రెండు ఒక్కలు పెట్టాలి ఇక ఏదైనా పండ్లు పెట్టే సమయంలో రెండు పండ్లను పెట్టి ఇవ్వాలి ఒకటి ఇవ్వకూడదు.వీటితోపాటు పసుపు కుంకుమ పువ్వులను కూడా తాంబూలంలో పెట్టి ఇవ్వాలి అయితే తాంబూలంలో పెట్టి ఇచ్చేటప్పుడు తమలపాకు తొడిమలు మన వైపు ఉండేలా చూసుకొని వారికి పసుపు రాసికుంకుమ బొట్టు పెట్టి తాంబూలం ఇవ్వాలి అనంతరం తాంబూలం తీసుకున్న వారు కూడా ఇచ్చిన వారికి కుంకుమ బొట్టు పెట్టాలి.
ఇలా తాంబూల విషయంలో కూడా ఈ పద్ధతులను పాటించడం వల్ల ఇచ్చిన వారికి ఎంతో మంచి కలుగుతుంది. ఇక తాంబూలం ఇచ్చే సమయంలో చాలామంది బ్లౌజ్ పీస్ లేదా శారీ కూడా ఇస్తూ ఉంటారు.అయితే తాంబూలం విషయంలో ఈ పద్ధతులు పాటించడం ఎంతో మంచిది. ఇక వరలక్ష్మీ వ్రతం చేసుకునేవారు చీకటి పడక ముందే ముత్తైదువులకు వాయనం ఇవ్వాలి. ముత్తైదువులకు ఉదయమే వాయనం ఇవ్వడం మంచిది. సాయంత్రం ఇచ్చినా కూడా చీకటి పడక ముందే వాయనం ఇవ్వడం ఎంతో మంచిది.
Tollywood : డిజిటల్ యుగంలో మనకు ఎన్ని సౌకర్యాలు అందుతున్నాయో అన్నీ సవాళ్లు ఎదురవుతున్నాయి. టెక్నాలజీని సరిగ్గా వాడుకోకపోతే ఒక్కోసారి…
Tollywood: పాన్ ఇండియన్ స్టార్ హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా భారీ చిత్రాలకు సైన్ చేశారు. అంతేకాదు, ఏమాత్రం…
Akka: సౌత్ బ్యూటీ కీర్తి సురేశ్ తెలుగులో సినిమా చేసి చాలా గ్యాప్ వచ్చింది. మహేశ్ బాబు సరసన నటించిన…
Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..? గత కొంత కాలంగా మన తెలుగు…
Tollywood Cinema: 2025 సంక్రాంతికి మూడు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మూడు…
జయ శంకర్ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా అరి. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే షూటింగ్…
This website uses cookies.