Tech: ప్రస్తుతం ఆధునిక ప్రపంచం, శాస్త్ర విజ్ఞానం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వైపు పరుగులు పెడుతుంది. టెక్నాలజీలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కీలక భూమిక పోషించబోతుంది. భవిష్యత్తు అంతా కూడా దీని మీదనే మానవ సమాజం ఎక్కువగా ఆధారపడుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే ప్రపంచంలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ తో నడుస్తున్న చాట్ బోట్ సర్వీసులుపై సర్వత్ర చర్చ నడుస్తుంది. మైక్రోసాఫ్ట్ భారీగా పెట్టుబడులు పెట్టి ఓపెన్ ఏఐ ద్వారా చాట్ జీపీటీని అభివృద్ధి చేసింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో సెన్సేషనల్ గా మారింది. ఈ చార్ట్ జీపీటీ ప్రస్తుతం టెక్స్ట్ రూపంలో ప్రజలకు కావలసిన ఎలాంటి సమాచారాన్ని అయినా క్షణాల్లోనే అందిస్తుంది.
భవిష్యత్తులో దీనిని సెర్చ్ ఇంజన్ గా తీసుకురావడానికి మైక్రోసాఫ్ట్ సన్నద్ధమవుతుంది. మైక్రోసాఫ్ట్ ఎక్స్ప్లోరర్ సెర్చ్ ఇంజన్ ని గూగుల్ క్రోమ్ మార్కెట్ లోకి వచ్చిన తర్వాత డామినేట్ చేసింది. దీంతో మైక్రోసాఫ్ట్ తన సెర్చ్ ఇంజన్ సేవలను ఫుల్ స్టాప్ పెట్టింది. అయితే ఈ చాట్ జీపీటీని భవిష్యత్తులో సెర్చ్ ఇంజిన్ గా అభివృద్ధి చేయబోతున్నట్లుగా మైక్రోసాఫ్ట్ స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే దీనికి పోటీగా గూగుల్ కూడా సరికొత్తగా చాట్ బోట్ ని గూగుల్ బార్డ్ పేరుతో తీసుకురాబోతుంది. ఓపెన్ ఏఐ సంస్థ స్టార్టప్ గా ప్రారంభమై అతి తక్కువ సమయంలో చాట్ జీపీటీని అభివృద్ధి చేయడంతో పాటు కేవలం రెండు నెలల్లోనే 10 కోట్ల మంది యూజర్లను సొంతం చేసుకుంది.
గూగుల్ గత ఆరేళ్ల నుంచి ఈ గూగుల్ బార్డ్ మీద వర్క్ చేస్తుంది. అయితే కాంపిటీషన్లో మైక్రోసాఫ్ట్ ముందుకి రావడంతో గూగుల్ మరింత స్పీడ్ పెంచి త్వరలో గూగుల్ బార్డ్ ను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే చాట్ జీపీటీ కారణంగా గూగుల్ మాతృ సంస్థ 7.8 శాతం షేర్లను కోల్పోయి 100 బిలియన్ డాలర్ల మేర నష్టాన్ని చవి చూసింది. దీంతో మళ్లీ ఆన్లైన్ ప్రపంచంలో గూగుల్ ఆధిపత్యాన్ని కొనసాగించాలంటే గూగుల్ బార్డ్ ని వీలైనంత వేగంగా అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు.
ప్రస్తుతం ఇది టెస్టింగ్ దశలో ఉన్నట్లు తెలుస్తుంది. చాట్ జీపీటీ కూడా కేవలం 2021 కంటే ముందు ఉన్న సమాచారాన్ని మాత్రమే క్రోడీకరించి చెబుతుంది. కాకుంటే ట్రాన్స్లేషన్, కంటెంట్ కరెక్షన్, కంటెంట్ రీ క్రియేషన్ వంటి విధానాల్లో చాట్ జీపీటీ ఎంతో ఉపయోగకరంగా ఉందని చెప్పాలి. మరి గూగుల్ చాట్ జీపీటీని డామినేట్ చేసే స్థాయిలో గూగుల్ బార్డ్ ని అందుబాటులోకి తీసుకువస్తుందా అనేది వేచి చూడాలి.