Tara Sutaria: బాలీవుడ్ లో యువ తారల నుంచి స్టార్ హీరోయిన్స్ వరకు అందరూ కూడా అందాల ప్రదర్శనలో ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా రెచ్చిపోతూ ఉంటారు. ఇండస్ట్రీలో దర్శకులని ఎట్రాక్ట్ చేయాలంటే వీలైనంత బోల్డ్ గా కనిపించడానికి సిద్ధంగా ఉండాలని అందాల భామలు ముందుగానే సిద్ధమైపోయి వస్తారు.
అలా వస్తూనే సోషల్ మీడియాలో గ్లామర్ బాంబ్స్ విసురుతూ ఉంటారు. హాట్ ఫోటో షూట్ లతో సెగలు రేపుతూ అందాల రచ్చ చేస్తారు. ఇక సోషల్ మీడియా దెబ్బకి అందాల భామలు అందరూ రాత్రికి రాత్రి ఫేమస్ అయిపోతూ ఉంటారు. ఇలా సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చిన అందాల భామలు చాలా మంది ఇప్పుడు ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా రూల్ చేస్తూ ఉన్నవారే.
కొంతమంది భామలు అయితే మోడలింగ్ లోకి అడుగుపెట్టి అక్కడి నుంచి బుల్లితెర ఆపై వెండితెర మీదకి వచ్చేస్తారు. ఇక చేసినవి కొన్ని సినిమాలే అయిన సెలబ్రిటీ ఫేమ్ తో ఇక వారి అందాల రచ్చ స్టార్ట్ చేస్తారు. సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోయి అక్కడ మంచి ఆదాయం పొందుతూ ఉంటారు.
ఇలాంటి అందాల భామలలో తారా సుతారియా కూడా ఒకరు. ఈ బ్యూటీ మోడలింగ్ నుంచి బాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెట్టింది. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తరువాత మార్జావాన్ అనే మూవీలో నటించింది. ఆర్ఎక్స్ 100 రీమేక్ గా తెరకెక్కిన తడప్ సినిమాలో లీడ్ రోల్ చేసింది. ఇక టైగర్ ష్రాఫ్ కి జోడీగా హిరోపంతి2లో నటించింది.
ఏక్ విలన్ రిటర్న్స్ 2లో అర్జున్ కపూర్ కి జోడీగా నటించింది. ప్రస్తుతం అప్రూవ అనే సినిమాలో నటిస్తుంది. ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో రెగ్యులర్ గా బికినీ అందాలతో రచ్చ చేస్తూ ఉంటుంది. తాజాగా మరోసారి గ్లామర్ ఫోటో షూట్ తో సందడి చేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.