Thambulam: సాధారణంగా మన ఇంటికి ఎవరైనా ముత్తైదువు కనుక వస్తే మన సాంప్రదాయాల ప్రకారం వారికి పసుపు కుంకుమ ఇవ్వడం జరుగుతుంది. ఇలా చాలామంది ఇంటికి వచ్చిన ముత్తయిదువులను వట్టి చేతులతో పంపకుండా వారికి తాంబూలం ఇచ్చి పంపిస్తుంటాము అయితే చాలా మంది తాంబూలం ఇచ్చే విషయంలో వారికి నచ్చిన విధంగా ఇస్తూ ఉంటారు. కానీ మన హిందూ సంప్రదాయాల ప్రకారం తాంబూలం ఇవ్వడంలో కూడా ఎన్నో నియమాలను పాటించాలని పండితులు చెబుతున్నారు. మరి తాంబూలం ఇచ్చే సమయంలో ఎలాంటి నియమాలను పాటించాలి ఏంటి అనే విషయానికి వస్తే…
మన ఇంటికి ఉదయం లేదా సాయంత్రం ఎవరైనా ముత్తైదువులు బంధువులు వస్తే వారికి తాంబూలం ఇస్తాం అయితే మరీ చీకటి పడిన తర్వాత వచ్చిన వారికి తాంబూలం ఇవ్వకపోవడం మంచిది. ఇక తాంబూలం ఇచ్చే సమయంలో ఒక్కొక్కరు ఒక్కోరకంగా ఇస్తూ ఉంటారు కానీ తాంబూలం ఇచ్చేటప్పుడు కచ్చితంగా ఈ నియమాలు పాటించాలి. తాంబూలంలో తప్పనిసరిగా ఉండాల్సింది తమలపాకులు అయితే ఈ తమలపాకులు తొడిమెలతో సహా ఉండాలి. తాంబూలం ఇచ్చేటప్పుడు తమలపాకులు శుభ్రం చేసి రెండు తమలపాకులలో రెండు ఒక్కలు పెట్టాలి.
ఇక వీటితోపాటు పండ్లు కూడా ఇవ్వాలి పండ్లు ఎప్పుడు కూడా ఒకటి ఇవ్వకూడదు రెండు పండ్లను ఇవ్వాలి. ఇక అరటి పండ్లు రెండు ఇచ్చేటప్పుడు వాటిని రెండుగా విడిచేసి ఇవ్వకుండా జతగా ఇవ్వాలి.వీటితోపాటు పువ్వులు కూడా తప్పనిసరిగా తాంబూలంలో ఉండేలా చూసుకోవాలి ముందుగా మన ఇంటికి వచ్చిన ముత్తైదువులకు మనం పసుపు కుంకుమ ఇచ్చేటప్పుడు మన కాళ్లకు పసుపు రాసుకొని మనం కుంకుమ బొట్టు పెట్టుకున్న తర్వాత వారికి పసుపు రాసి కుంకుమ పెట్టాలి అనంతరం తాంబూలం ఇవ్వాలి అయితే తాంబూలం ఇచ్చేటప్పుడు తమలపాకు తొడిమలు మన వైపు ఉండేలా చూసుకోవాలి. ఇక తాంబూలం ఇచ్చే సమయంలో చాలామంది వారి ఆర్థిక స్తోమతను బట్టి చీర లేదా జాకెట్ అయినా కూడా ఇస్తుంటారు ఇలా ఇవ్వడం కూడా మంచిదే.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.