Tollywood : దిల్ రాజు బాలీవుడ్ మూవీలో హీరోయిన్‌గా నయనతార ఫిక్స్

Tollywood : టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు బాలీవుడ్‌లో ఓ భారీ చిత్రాన్ని నిర్మించంబోతున్నట్టుగా గత కొంతకాలం నుంచి వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా, ఈ ప్రాజెక్ట్ నుంచి అఫీషియల్ కన్‌ఫర్మేషన్ వచ్చింది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో దిల్ రాజు నిర్మాణంలో కొత్త చిత్రం ఈ నెలలో ప్రారంభం కాబోతోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనున్నాడు. తాజాగా, మేకర్స్ ఈ సినిమాలో సల్మాన్ సరసన నయన్ నటిస్తున్నట్టుగా ప్రకటించారు.

నాలుగు పదుల వయసులోనూ నయనతార క్షణం తీరిక లేకుండా సినిమాలు చేస్తోంది. ఇప్పటికే, చేతిలో 5 చిత్రాలున్నాయి. ప్రస్తుతం తెలుగులో నట సింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ఎన్‌బికే 111లో హీరోయిన్‌గా నటిస్తోంది. బాలయ్యకి వీరసింహారెడ్డి మూవీతో హిట్ ఇచ్చిన గోపీచంద్ మలినేని ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. కన్నడలో యష్ హీరోగా రూపొందుతున్న టాక్సిక్ మూవీలో నయన్ కీలక పాత్రను చేస్తోంది. తమిళంలో నయన్ నటిస్తున్న రెండు సినిమాలు ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్‌ను జరుపుకుంటున్నాయి. ఈ రెండు సినిమాలు త్వరలో రిలీజ్ కానున్నాయి.

tollywood-nayanthara-fixed-as-heroine-in-dil-rajus-bollywood-movie

Tollywood : 5 చిత్రాలతో బిజీగా ఉన్న నయన్

ఇది కాకుండా మరో తమిళ సినిమా చేస్తోంది. అలాగే, మలయాళంలోనూ నయనతార ఓ క్రేజీ మూవీని చేస్తోంది. ఇలా, 5 చిత్రాలతో బిజీగా ఉన్న నయన్ కి మరోసారి బాలీవుడ్ సినిమాలో అవకాశం దక్కింది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తుండగా, సల్మాన్ ఖాన్ హీరోగా నటించబోతున్నాడు. ఏప్రిల్ నెలలోనే ఘనంగా ప్రాజెక్ట్ ని లాంచ్ చేయబోతున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి సరసన నటించిన మన శంకరవరప్రసాద్‌గారు సినిమాతో మంచి కంబ్యాక్ ఇచ్చి సాలీడ్ హిట్ అందుకుంది.

బాలయ్య-నయన్‌లది స్పెషల్ కాంబినేషన్..

బాలకృష్ణ, నయనతారలది స్పెషల్ కాంబినేషన్ అని చెప్పాలి. వీరిద్దరు కలిసి సింహ, శ్రీరామరాజ్యం, జై సింహ సినిమాలలో నటించారు. ఇప్పుడు నాలుగవసారి బాలయ్య 111వ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే, ఈ మూవీపైన అందరిలోనూ అంచనాలు బాగా పెరిగిపోయాయి. ఇలాంటి సమయంలో హిందీ సినిమా, అది కూడా సల్మాన్ ఖాన్ సరసన అంటే..ఆ ప్రాజెక్ట్ కి ఎంత క్రేజ్ వస్తుందో ఊహించుకోవచ్చు. ఇంతకముందు, షారుఖ్ ఖాన్ సరసన హీరోయిన్‌గా నటించింది. అట్లీ దర్శకత్వంలో వచ్చిన జవాన్ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి హిట్ అందుకుంది. ఇప్పుడు, సల్మాన్ సినిమాకి సైన్ చేసింది. మొత్తానికి, సౌత్ మాత్రమే కాకుండా నార్త్ బెల్ట్‌లోనూ నయన్ దూసుకుపోతుండటం గొప్ప విశేషం.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

3 days ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

3 days ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

3 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

3 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

3 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

4 weeks ago

This website uses cookies.