Varanasi: మహేష్ బాబు, ప్రియాంక చోప్రా లపై సాంగ్ షూట్ అప్‌డేట్

Varanasi: సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న పాన్ వరల్డ్ సినిమా వారణాసి. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్నారు. శ్రీదుర్గ ఆర్ట్స్ పతాకంపై డా.కె.ఎల్ నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన కీలక పాత్రధారుల లుక్స్, గ్లోబ్ ట్రాటర్ అంటూ రిలీజ్ చేసిన వారణాసి టైటిల్ గ్లింప్స్ ఒక్కసారిగా ఈ మూవీపై అంచనాలను పెంచిన సంగతి తెలిసిందే.

దర్శకుడు రాజమౌళి సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్ళడంలో, ప్రపంచవ్యాప్తంగా అంచనాలు పెంచడంలో ఉపయోగించే స్ట్రాటజీస్ గురించి ఎంతో ప్రత్యేకంగా చెప్పాలి. అయితే, రాజమౌళి రూపొందించే ప్రతీ సినిమా దేనికదే ప్రత్యేకంగా మారుతుంది. బాహుబలి ఫ్రాంఛైజీస్‌తో ప్రభాస్ ని పాన్ ఇండియా స్టార్‌గా.. ఆ తర్వాత జూ.ఎన్‌టీర్, రామ్ చరణ్‌లకు ఆర్ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియా స్టార్స్‌గా క్రేజ్ తీసుకొచ్చిపెట్టాడు. ఇప్పుడు, సూపర్ స్టార్ మహేష్ బాబును హాలీవుడ్ రేంజ్ హీరోగా చూపించడానికి అన్నీ ప్రయత్నాలు చేస్తున్నాడు.

varanasi-song-shoot-update-on-mahesh-babu-and-priyanka-chopra

Varanasi: 2027 లో ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు.

ఇప్పటికే, వారణాసి సినిమా గురించి ఏ వార్త వచ్చినా.. అది వైరల్ అవుతోంది. 2027 లో ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. మొత్తం 120 దేశాలలో ఈ సినిమాను ఐమాక్స్ ఫార్మాట్ లో ఆవిష్కరించబోతున్నారు. ఇక, తాజా సమాచారం మేరకు, మహేష్ బాబు-ప్రియాంక చోప్రాలపై ఓ సాంగ్‌ను షూట్ చేయడానికి రాజమౌళి బృందం రెడీ అవుతోంది. వారణాసి టైటిల్ గ్లింప్స్ సమయంలో స్టార్ హీరోయిన్ శృతి హాసన్ పాడిన సంచారి సాంగ్ లిరికల్ వీడియో వచ్చి ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే.

మరి, మహేష్-ప్రియాంక లపై రాజమౌళి చిత్రీకరించబోతున్న ఈ డ్యూయట్ ని ఏ సింగర్స్ పాడారో, ఎలా ఉండబోతుందో..ఎలాంటి సెట్స్‌లో ఈ పాట షూట్ చేయనున్నారో.. అని అటు మహేష్ అబిమానులతో పాటు ఇటు సినీ లవర్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలో, ఈ సాంగ్ కి సంబందించిన అప్‌డేట్ ని కూడా రాజమౌళి బృందం ఇవబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక, ఈ చిత్రానికి కథ వి.విజయేంద్ర ప్రసాద్, సంగీతం ఎం ఎం కీరవాణి. దర్శకరచయిత దేవా కట్ట డైలాగ్స్ రాస్తున్నారు. 1300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో మహేష్ వారణాసి నిర్మితమవుతోంది. ఇటీవలే, ఈ మూవీ కోసం వేసిన సెట్స్‌కి సంబందించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

 

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

2 days ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

3 days ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

3 days ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 week ago

Lord Shiva: కోరిన కోరికలు తీరడం లేదా.. శివాలయంలో ఈ పరిహారం చేస్తే చాలు!

Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…

1 week ago

Climbing Stairs: మెట్లు ఎక్కుతూ అలసిపోతున్నారా? ఫిట్ నెస్ లోపం అనుకుంటే పొరపాటే?

Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…

1 week ago

This website uses cookies.