Balakrishna: నందమూరి బాలకృష్ణకు ‘లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు’..

Balakrishna: టాలీవుడ్ సీనియర్ హీరో నట సింహం నందమూరి బాలకృష్ణకు మరో అరుదైన అవార్డు దక్కింది. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో 5 దశాబ్దాలుగా మాస్ క్లాస్ ఆడియన్స్ మాత్రమే కాకుండా ప్రతీ ఒక్క సినీ ప్రేమికుడిని అలరిస్తున్న బాలయ్య, ఇప్పటికే ఎన్నో అవార్డులను అందుకున్న సంగతి తెలిసిందే. కుటుంబ కథా చిత్రాలతో మెప్పించాడు. ఫ్యాక్షన్ సినిమా అంటే కేరాఫ్ బాలకృష్ణ. యాక్షన్ సినిమా అంటే పవర్ ఫుల్ డైలాగులుతో విరుచుకుపడేది బాలయ్యే. ఇక, పౌరాణిక..జానపద చిత్రాలలో బాలకృష్ణ చేసిన పాత్రలు మైలురాయిలా మిగిలాయి.

ఇటీవల కాలంలో బాలకృష్ణ చేసిన సినిమాలన్నీ వరుసగా బాక్సాఫీస్ వద్ద భారీ కమర్షియల్ సక్సెస్‌లను అందుకున్నాయి. గత చిత్రం అఖండ 2 సనాతన హైంధవ ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతీ ఒక్కరు తెలుసుకోవాలి, ఆచరించాలి అనే రీతిలో రూపొందించగా, ఇందులో ఆయన పోషించిన రెండు పాత్రలు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి. ప్రస్తుతం, బాలకృష్ణ తన 111 వ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఒకవైపు సినిమాలు..మరో వైపు రజకీయాలతో ప్రేక్షకులకి, ప్రజలకి దగ్గరగా ఉంటున్నారు.

nandamuri-balakrishna-to-receive-lifetime-achievement-award

Balakrishna: యాభై ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు

అంతేకాదు, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎంతోమందికి వైద్య సేవలందిస్తున్న సంగతీ మనందరికీ తెలిసిందే. అయితే, బాలయ్యకు తాజాగా మన నట సింహానికి ఢిల్లీలోని భారత్ మండపంలో ఎంతో ఘనంగా జరిగిన ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఢిల్లీ’ 2026 వేడుకల్లో ప్రతిష్టాత్మక ‘లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు’ ను అందజేశారు. బాలకృష్ణ తన యాభై ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు, అలాగే.. అంకితభావంతో భారతీయ చలన చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలకు గానూ గుర్తింపుగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందజేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా చేతుల మీదుగా బాలయ్య ఈ అవార్డును స్వీకరించడం మరో విశేషం.

కాగా, ఈ కార్యక్రమంలో చిత్ర పరిశ్రమలకి చెందిన పలువురు సినీ ప్రముఖులు, ఇతర రాజకీయ మరియు సాంస్కృతిక రంగాల ప్రముఖులు పాల్గొని బాలయ్యను అభినందించారు. ఇక, ఇప్పటికే ఆయన నటించిన ‘భగవంత్ కేసరి’ సినిమా 71వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ తెలుగు చిత్రంగా స్థానం సంపాదించుకోగా, 2025లో భారత ప్రభుత్వం బాలకృష్ణను ‘పద్మభూషణ్’ పురస్కారంతో గౌరవించిన సంగతి అందరికీ తెలిసిందే. ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఢిల్లీ’ అందుకున్న ఈ అవార్డుతో బాలయ్య అభిమానులే కాక సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక, వీరసింహారెడ్డి మూవీతో బాలకృష్ణకి సూపర్ హిట్ ఇచ్చిన మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఇప్పుడు ఎన్‌బికె 111 చిత్రాన్ని చేస్తున్నాడు బాలయ్య. ప్రముఖ మాటల రచయిత సాయి మాధవ్ బుర్ర ఈ చిత్రానికి పనిచేస్తున్నారు.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

1 day ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

1 day ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

5 days ago

Lord Shiva: కోరిన కోరికలు తీరడం లేదా.. శివాలయంలో ఈ పరిహారం చేస్తే చాలు!

Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…

5 days ago

Climbing Stairs: మెట్లు ఎక్కుతూ అలసిపోతున్నారా? ఫిట్ నెస్ లోపం అనుకుంటే పొరపాటే?

Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…

6 days ago

Aja Ekadashi 2026: రేపే అజ ఏకాదశి.. ఈ పరిహారాలు చేస్తే విష్ణు దేవుడి అనుగ్రహం మీపైనే?

Aja Ekadashi 2026: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం శ్రావణ మాసానికి ఎంతో మంచి ప్రత్యేకత ఉంది. ఈ శ్రావణ…

6 days ago

This website uses cookies.