Anil Ravipudi: మన టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కీర్తి సురేష్ మంచి సక్సెస్‌లను అందుకున్న సంగతి తెలిసిందే. నేను శైలజ మూవీతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన కీర్తి.. నేను లోకల్, మహానటి, రంగ్ దే, సర్కారు వారి పాట, దసరా, భోళా శంకర్ లాంటి సినిమాలు చేసింది. ముఖ్యంగా, మహానటి సినిమాతో జాతీయ అవార్డును కూడా దక్కించుకుంది. అయితే, తెలుగులో మాత్రమే కాకుండా, తన మాతృ భాష సహా మిగతా సౌత్ భాషలలో..హిందీలో చేసిన సినిమాలేవీ కలిసి రాలేదు.
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన కీర్తి..అక్కడ కావాల్సిన అందాలను ఆరబోసినప్పటికీ, ఒక్క హిట్ కూడా దక్కలేదు. ఈ క్రమంలో తెలుగులో కీర్తికి బాగానే గ్యాప్ వచ్చింది. ప్రస్తుతం, విజయ్ దేవరకొండ సరసన రౌడీ జనార్ధన చేస్తోంది. ఎల్లమ్మ మూవీలో నటించాల్సి ఉండగా..ఎందుకనో ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ఇప్పుడు, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ హీరోలుగా ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్రకటించాడు. 2027, సంక్రాంతికి ఈ మూవీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారి. ఇందులో వెంకీ జోడీగా కీర్తి ఎంపికైందని తెలుస్తోంది.
అనిల్ రావిపూడి హీరోలకే కాదు..హీరోయిన్స్ కి కూడా బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు. మెహ్రీన్, తమన్నా లకి ఎఫ్ 2, ఎఫ్ 3 మూవీలతో బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. భగవంత్ కేసరి మూవీతో కాజల్ అగర్వాల్, శ్రీలీలకు, సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరీలకు, మన శంకరవరప్రసాద్‌గారు సినిమాతో నయనతారకు బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు. ఇప్పుడు, అనిల్ రావిపూడి.. కీర్తి, కృతి శెట్టిలకు తన సినిమాలో అవకాశం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఉప్పెన సినిమాతో దూసుకొచ్చిన కృతి శెట్టి..మొదటి సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకుంది.
ఆ తర్వాత, బంగర్రాజు మూవీతో మరో హిట్ అందుకుంది. అంతే..ఈ సినిమా తర్వాత చేసిన ఏ సినిమా కూడా కృతికి కలిసి రాలేదు. తమిళంలో ఎంట్రీ ఇచ్చినప్పటికీ..అక్కడ కూడా చేదు అనుభవమే చూడాల్సి వచ్చింది. ఇలాంటి, సమయంలో అనిల్ రావిపూడి సినిమా అంటే నిజంగా ఈ ఇద్దరు హీరోయిన్స్‌కి గోల్డెన్ ఛాన్స్ అనాలి. కళ్యాణ్ రామ్ కి జతగా కృతి శెట్టిని ఎంపిక చేసినట్టుగా ఫిల్మ్ సర్కిల్స్ లో వార్త చక్కర్లు కొడుతోంది. చూడాలి, మరి అధికారికంగా ఈ మూవీలో కీర్తి, కృతిల ఎంపిక విషయం ఎప్పుడు వస్తుందో. కాగా, జూన్ నుంచి సెట్స్ మీదకి ఈ ప్రాజెక్ట్‌ను తీసుకురాబోతున్నారట. సంక్రాంతి టార్గెట్ మిస్ కాకుండా అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నాడు.
Gut Health: సాధారణంగా మనం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతీ రోజు వ్యాయామం చేయటం ఎంతో మంచిదే అయితే ఇది ఉరుకుల…
Lord Shiva: సాధారణంగా మన హిందూ సంప్రదాయాల ప్రకారం ప్రతిరోజు ఒక దేవుడికి అంకితం చేయబడి ఆ రోజున ఆ…
AP POLITICS: రాజకీయాల్లో వ్యూహాలు ఎంత ముఖ్యమో.. ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టే కౌంటర్ అటాక్ కూడా అంతే ముఖ్యం. ప్రస్తుతం…
Telangana: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతర్గత సెగలు మళ్లీ మొదలయ్యాయి. పాలనపై పట్టు పెంచుకునే పనిలో ఉన్న సీఎం రేవంత్…
AP POLITICS: ఆళ్లగడ్డ అనగానే ఒకప్పుడు ఫ్యాక్షన్ పాలిటిక్స్ గుర్తొచ్చేవి. కానీ, ఇప్పుడు అక్కడ రూట్ మారింది. సరికొత్తగా ‘హెయిర్…
AP NEWS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీ సరికొత్త ఊపుతో దూసుకుపోతోంది. సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయం తర్వాత, డిప్యూటీ…
This website uses cookies.