Mahesh Babu: వారణాసి అప్‌డేట్స్‌తో రాజమౌళి ఏం ప్లాన్ చేస్తున్నాడో!

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో పాన్ వరల్డ్ చిత్రంగా రూపొందుతోంది వారణాసి. శ్రీదుర్గ ఆర్ట్స్ పతాకంపై డా.కె.ఎల్ నారాయణ దాదాపు 1200 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ మూవీ అనుకున్నప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఒక్కరిలో అంచనాలు ఊహించని విధంగా ఏర్పడ్డాయి. జేంస్ కెమరూన్ లాంటి హాలీవుడ్ అగ్ర దర్శకుడు కూడా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారంటే రాజమౌళి సినిమాపై దేశ విదేశాలలో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఇక, రాజమౌళి సినిమా అంటే హీరో పాత్రమే కాదు, హీరోయిన్..ఇతర ప్రధాన పాత్రలు, సన్నివేశాలు, సెట్స్..ఇలా ప్రతీ ఒక్కటీ ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. బాహుబలి సినిమా నుంచి రాజమౌళి వేస్తున్న సెట్స్ గురించి ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకుంటున్నారు. అలాంటిది ఇప్పుడు వారణాసి రూపొందుతోందంటే..అందరిలోనూ ఈ మూవీలో ఎలాంటి సెట్స్ ఉన్నాయి..ఒక్కో సెట్ కోసం ఎన్ని కోట్లు ఖర్చు చేస్తున్నారు..మహేష్ ఎలాంటి పాత్రల్లో కనిపించబోతున్నారు!..ఇలాంటి ఆతృతతో కూడుకున్న ప్రశ్నలెన్నో ఉన్నాయి.

mahesh-babu-what-is-rajamouli-planning-with-the-varanasi-updates

Mahesh Babu: 2027, ఏప్రిల్ 7న వారణాసి రిలీజ్ చేసేందుకు జక్కన్న ప్లాన్ చేస్తున్నారు.

ఇప్పటికే, గ్లోబ్ ట్రాటర్ అంటూ వదిలిన వారణాసి టైటిల్ గ్లింప్స్ చూసిన ప్రతీ ఒక్కరికీ ఇది మరో సంచలన చిత్రం కాబోతుందని బలంగా చెప్తున్నారు. 120 దేశాలలో వారణాసి సినిమాను రిలీజ్ చేయనున్నారు. 2027, ఏప్రిల్ 7న వారణాసి రిలీజ్ చేసేందుకు జక్కన్న ప్లాన్ చేస్తున్నారు. అయితే, ఈ సినిమా నుంచి నెలలో ఒకసారి ఓ క్రేజీ న్యూస్ వచ్చి అంచలంచెలుగా అంచనాలను పెంచుతోంది. అలా, తాజాగా సెట్స్ కి సంబందించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవన్నీ చూసి మహేష్ వారణాసి కోసం సరికొత్త రీతిలో భారీ హంగులతో కళ్ళు మిరిమిట్లు గొలిపేలా సెట్స్ ని నిర్మిస్తున్నట్టుగా అర్థమవుతోంది.

గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, పృథ్విరాజ్ సుకుమారన్, ఆర్.మాధవన్ లాంటి దిగ్గజ నటీ నటులు వారణాసి మూవీలో కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఇప్పటి వరకూ రాజమౌళి నుంచి పాన్ ఇండియా సినిమాలు బాహుబలి సిరీస్, ఆర్ఆర్ఆర్ ల కంటే వారణాసి 10 రెట్లు ఉంటుందని ఒక్క గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ తో క్లారిటీ ఇచ్చారు జక్కన్న టీం. ఇప్పటి వరకూ ఓ హాలీవుడ్ సినిమా రిలీజ్ అవుతుందంటే ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి అంచనాలు, క్రేజ్ ఉంటుందో..ఇప్పుడు అలాంటి క్రేజ్ మన ఇండియన్ సినిమా మరీ ముఖ్యంగా మన తెలుగు సినిమా వారణాసి మీద ఉండటం పూర్తిగా రాజమౌళి సాధించిన క్రెడిట్ అండ్ క్రేజ్ అని చెప్పాలి. మొత్తానికి, ఇప్పుడైతే ఈ సినిమా కోసం వేసిన సెట్స్ అంతటా వైరల్ అవుతున్నాయి.

 

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

15 hours ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

2 days ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

2 days ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

6 days ago

Lord Shiva: కోరిన కోరికలు తీరడం లేదా.. శివాలయంలో ఈ పరిహారం చేస్తే చాలు!

Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…

6 days ago

Climbing Stairs: మెట్లు ఎక్కుతూ అలసిపోతున్నారా? ఫిట్ నెస్ లోపం అనుకుంటే పొరపాటే?

Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…

1 week ago

This website uses cookies.