Tamanna Bhatia : టాలీవుడ్ హీరోయిన్ తమన్నా కొత్త చిక్కుల్లో పడింది. తాజాగా ఈ అమ్మడికి మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు పంపించాడు. రూల్స్ కు వ్యతిరేకంగా ఐపీఎల్ మ్యాచ్‌లను ఫెయిర్ ప్లే అప్లికేషన్ లో లైవ్ స్ట్రీమింగ్ చేసినందుకు ఆమె ఎప్రిల్ 29న విచారణకు రావాలని పోలీసులు నోటీసుల్లో తెలిపారు. తమన్న చేసిన ఈ పని వల్ల తమకు కోట్లలో నష్టం వచ్చిందని టెలికాస్ట్ రైట్స్ కలిగిన వయాకమ్ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు తమన్నకు నోటీసులు పంపారు.
ఇదే కేసులో ఇదివరకే బాలీవుడ్ హీరో సంజయ్ దత్‌కి కూడా పోలీసులు సమన్లు పంపారు. ఈ నెల 23న విచారణకు రావాలని తెలిపారు. అయితే సంజయ్ గైర్హాజరయ్యాడు. ఆ రోజు ముంబైలో లేకపోవడం వల్లనే విచారణకు రాకేకపోయానని తెలిపాడు. తన స్టేట్మెంట్ ను రికార్డ్ చేసేందుకు మరో డేట్ ని సూచించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశాడు.
ఐపీఎల్ మ్యాచుల డిజిట్ల టెలికాస్ట్ రైట్స్‌ను వయాకామ్ దక్కించుకుంది. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఐపీఎల్ మ్యాచ్‌లను ఫెయిర్ ప్లే అప్లికేషన్ లో లైవ్ స్ట్రీమింగ్ చేసినందుకు ఆ సంస్థ మహారాష్ట్ర సైబర్ సెల్ పోలీసులు ఫిర్యాదు చేసింది. దీంతో ఫెయిర్ ప్లే యాప్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. ఫెయిర్ ప్లే యాప్ కారణంగా తమకు రూ.100 కోట్ల నష్టం వచ్చిందని వయాకామ్ తన కంప్లైంట్ లో తెలిపింది.
అంతేకాదు బాలీవుడ్ సెలబ్రిటీలకు ఈ యాప్ డబ్బులు కూడా ఇచ్చినట్లు తెలిపింది. కురాకోలో ఉన్న ప్లే వెంచర్ అనే కంపెనీ అకౌంట్ నుంచి సంజయ్ దత్ కు సొమ్ము అందిందని తెలిపింది. సంజయ్ తో పాటు తమన్నాకు డబ్బులు అందాయని అందుకే వారిని సాక్షులుగా పేర్కొంటూ విచారించాలని వయాకామ్ కోరింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు తమన్నాకు తజాగా నోటీసులు పంపించారు. మరి మిల్కీ బ్యూటీ ఈ నోటీసులను సీరియస్ గా తీసుకుని విచారణకు హాజరవుతుందా లేదా మిగతా స్టార్స్ లాగే డుమ్మా కొడుతుందో వెయిట్ చేసి చూడాల్సిందే.