Tue. Jan 20th, 2026

    Swollen Gums: ప్రస్తుత కాలంలో చిన్న పిల్లల నుంచి మొదలుకొని పెద్దవారి వరకు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యలల్లో దంత సమస్య ఒకటి. దంతాల నొప్పి సమస్య మాత్రమే కాకుండా చిగుళ్ళు వాపు రావడం చిగుళ్ల నుంచి రక్తస్రావం జరగడం వంటి సమస్యలతో కూడా బాధపడుతూ ఉంటారు.ఇలా చిగుళ్ల వాపు నొప్పి సమస్య చాలా చిన్నది అయినప్పటికీ నొప్పి తీవ్రత మాత్రం చాలా కఠినంగా ఉంటుంది. కొన్నిసార్లు ఈ నొప్పి కారణంగా తినడానికి కూడా వీలు కాకుండా పోతుంది. మరి చిగుళ్ల వాపు రావడానికి గల కారణాలు ఏంటి అనే విషయానికి వస్తే..

    దంత సంరక్షణ లేకపోవడం ప్రధాన కారణం అలాగే కఠినమైన టూత్ బ్రష్ ఉపయోగించటం వల్ల కూడా చిగుళ్ళు వాపు ఏర్పడుతుంది. పళ్ళ మధ్యలో పాచి పేరుకుపోవడం, చల్లటి పానీయాలను అధికంగా తీసుకోవడం వల్ల కూడా ఈ చిగుళ్ళు వాపు సమస్య తలెత్తుతుంది.ఈ విధమైనటువంటి నొప్పితో బాధపడేవారు ఈ సింపుల్ చిట్కాను కనుక పాటిస్తే తొందరగా చిగుళ్ళు వాపు నొప్పి సమస్య నుంచి ఉపశమనం పొందడమే కాకుండా చిగుళ్ళ నుంచి రక్తస్రావం రావడం, వాపు సమస్య నుంచి కూడా పూర్తిగా విముక్తి పొందవచ్చు.

    Swollen Gums:

    మూడు లేదా నాలుగు వెల్లుల్లి రెబ్బలను తీసుకొని వాటిని సన్నగా తురిమి వాటిని జ్యూస్ బయటకు తీయాలి ఇలా ఒక టేబుల్ స్పూన్ వెల్లుల్లి జ్యూస్ లోకి రెండు టేబుల్ స్పూన్ల రెగ్యులర్ టూత్ పేస్ట్ ఒక టీ స్పూన్ టమాటో జ్యూస్,హాఫ్ టేబుల్ స్పూన్ పింక్ సాల్ట్ వేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమంతో స్మూత్ గా ఉండే టూత్ బ్రష్ తీసుకుని బ్రష్ చేయాలి. ఇలా ప్రతిరోజు చేయటం వల్ల సమస్య నుంచి పూర్తిగా ఉపశమనం పొందవచ్చు. అలాగే దంతాలపై పేరుకుపోయినటువంటి పసుపు పచ్చ మరకలు కూడా తొలగిపోతాయి.