Swayambhu: బాహుబలి ని గుర్తు చేస్తున్న స్వయంభు టీజర్..నిఖిల్ రేంజ్ మారుతుందా?

Swayambhu: బాహుబలి ని గుర్తు చేస్తున్న స్వయంభు టీజర్..నిఖిల్ రేంజ్ మారుతుందా?..అవును తాజాగా నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా స్వయంభు టీజర్ వచ్చాక సినీ లవర్స్ మాట్లాడుతున్న మాటలివి. భరత్ కృష్ణమాచార్య దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఎపిక్ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుపుకుంటోంది. హ్యాపీడేస్ సినిమాలో జాలీ రోల్ పోషించిన నిఖిల్ ఆ తర్వాత సోలో హీరోగా నిలబడ్డాడు.

హ్యాపీడేస్ సినిమాలో నటించిన ప్రధాన పాత్రల్లో వరుణ్ సందేష్ ప్రస్తుతం ఫేడవుట్ అయినట్టుగా కనిపిస్తోంది. కానీ, ఈ సినిమాలో ఓ రోల్ పోషించిన నిఖిల్ మాత్రం మంచి కథలను ఎంచుకుంటూ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ సినిమాలలో ఛాన్స్ దక్కించుకునే స్టేజ్‌కి చేరుకున్నాడు. కార్తికేయ 2 మూవీతో 100 కోట్ల మార్క్ చేరుకున్న నిఖిల్..ఇప్పుడు నెక్స్ట్ లెవల్ సినిమాతో వస్తున్నాడు. నిన్నా మొన్నటి వరకూ ఈ మూవీ ఎలా ఉంటుందో అనే మాట్లాడుకున్నారు.

swayambhu-teaser-reminds-me-of-baahubali-will-nikhils-range-change

Swayambhu: నిఖిల్ లాంటి మిడ్ రేంజ్ హీరోపై ఇంత బడ్జెట్ పెడితే వర్కౌట్ అవుతుందా!

నిఖిల్ లాంటి మిడ్ రేంజ్ హీరోపై ఇంత బడ్జెట్ పెడితే వర్కౌట్ అవుతుందా! అనే సందేహాలను వ్యక్తం చేసిన వారున్నారు. కానీ, తాజాగా రిలీజ్ చేసిన స్వయంభు మూవీ టీజర్‌తో మేకర్స్ ఆ ఆలోచనను పూర్తిగా మార్చేసి సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశారు. ముఖ్యంగా మూవీ టీజర్ లో కొన్ని షాట్స్ చూస్తుంటే దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి రూపొందించిన పాన్ ఇండియన్ సినిమా సిరీస్ బాహుబలి ని గుర్తు చేస్తున్నాయి.

నిఖిల్ యాక్షన్ షాట్స్..హీరోయిన్ సంయుక్త షాట్స్ చూస్తుంటే ప్రభాస్, అనుష్క లతో రాజమౌళి తీసిన కొన్ని పవర్ ఫుల్ షాట్స్ మక్కీకి మక్కీగా కనిపించాయి. రాజమౌళి మాహిష్మతి సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసినట్టుగానే ఇక్కడ కూడా టీజర్ మొదట్లోనే ఆ షాట్ కనిపిస్తుంది. బాణాలను వదిలే షాట్..నిఖిల్ పొగలోనుంచి రివీల్ అయ్యే షాట్..గిర్రున తిరుగుతూ వెళ్ళి నిఖిల్ చేతిలో పడే కత్తి షాట్..నిఖిల్ జుట్టు గాలికి ఊగే షాట్..శూలం విసిరిన షాట్..ఒక రాయి మీద కూర్చొని కత్తిని నేలకి నిలబెట్టే షాట్..ఇలా బాహుబలి మూవీస్ లో ఉన్న చాలా సిమిలర్ షాట్స్ స్వయంభు టీజర్‌లో కనిపించాయి. ఇక, నభా నటేష్ పాత్ర కూడా తమన్నా లా అనిపించింది. ఏది ఏమైనా టీజర్ మాత్రం మూవీపై భారీ అంచనాలను పెంచేసింది. మరి, ఈ సినిమాతో దర్శకనిత్మాతలకి..నిఖిల్..అలాగే, హీరోయిన్స్‌కి ఎలాంటి సక్సెస్ అందుకుంటారో చూడాలి.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

ALLU ARJUN: AA22 టైటిల్ “రాకా”..ఇది ఎవరూ ఊహించనిది!

ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…

6 days ago

Ram Charan: ‘పెద్ది’ కథకి స్పూర్తి ఆమిర్ ఖాన్ సినిమాలేనా?

Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…

1 week ago

Chiranjeevi: విశ్వంభర మరింత ఆలస్యం..ఆ సినిమాలా అవుతుందా?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…

1 week ago

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…

1 week ago

Peddi Movie: పెద్ది రిలీజ్ విషయంలో రామ్ చరణ్ చెప్పినా నమ్మని ఫ్యాన్స్!?

Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…

1 week ago

Carmeni Selvam (2026) – Movie Review: కార్మేని సెల్వం బ్యూటిఫుల్ ఎమోషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్‌తో సాగిన చక్కటి కుటుంబకథా చిత్రం

Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…

2 weeks ago

This website uses cookies.