Allu Arjun: బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్న ఐకాన్ స్టార్..దర్శకుడెవరంటే!

Allu Arjun: బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్న ఐకాన్ స్టార్ అంటూ.. ఓ లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సుకుమార్ దర్శకత్వంలో చేసిన పుష్ప ఫ్రాంఛైజీస్‌తో పాన్ ఇండియన్ స్టార్‌గా మారిన అల్లు అర్జున్, తన నెక్స్ట్ సినిమాలను కూడా అదే స్కేల్‌లో ప్లాన్ చేసుకుంటున్నాడు. పుష్ప సినిమాలతో వచ్చిన క్రేజ్ అల్లు అర్జున్‌కి కోలీవుడ్ సహా బాలీవుడ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియన్ సినిమాలు చేసే అవకాశాలను తెచ్చిపెడుతోంది.

ప్రస్తుతం, తమిళ అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్.. అల్లు అర్జున్ హీరోగా భారీ బడ్జెట్‌తో సైన్స్ ఫిక్షన్ సినిమాను నిర్మిస్తోంది. అట్లీ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. దీపిక పడుకొణ్ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ కెరీర్‌లో 22వ సినిమాగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేస్తున్న ఈ సినిమా 2027లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత బన్నీ తన 23వ సినిమాను లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే.

allu-arjun-bollywood-entry-movie-with-sanjay-leela-bhansali

Allu Arjun: సంజయ్ లీల భన్సాలీ దర్శకత్వంలో అల్లు అర్జున్ 24వ సినిమా!

టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ఇటీవలే అధికారికంగానూ ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. ఇలా, రెండు పాన్ ఇండియన్ సినిమాలను కోలీవుడ్ డైరెక్టర్స్‌తో చేస్తున్న అల్లు అర్జున్.. తన 24వ సినిమాను బాలీవుడ్ లెజండరీ డైరెక్టర్ సంజయ్ లీల భన్సాలీ దర్శకత్వంలో చేయనున్నట్టుగా లేటెస్ట్ న్యూస్ ఒకటి బాలీవుడ్‌తో పాటు సౌత్ మీడియాలలోనూ ప్రచారం అవుతోంది. అత్యంత భారీ స్థాయిలో ఓ విజువల్ వండర్‌గా ఈ మూవీ రూపొందనుందట. ఇంటెన్స్ డ్రామా కూడా ఈ కథలో ఉందని తెలుస్తోంది.

అల్లు అర్జున్ ఎప్పటి నుంచో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వాలని ట్రై చేస్తున్నాడు. అందుకు, సంజయ్ లీల భన్సాలీ చెప్పిన కథ పర్ఫెక్ట్ అని ఈ ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. మరి, సుకుమార్ దర్శకత్వంలో చేయాల్సిన పుష్ప 3 ఎప్పుడు పట్టాలెక్కుతుందో, తెలియాల్సి ఉంది. గత రెండు భాగాలకంటే పుష్ప 3 మరింత హై ఓల్టేజ్ యాక్షన్ మూవీగా సుక్కూ రూపొందించడానికి పక్కాగా స్క్రిప్ట్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఆల్రెడీ రెండు సినిమాలను చేస్తున్న అల్లు అర్జున్..తన 24వ సినిమాగా బాలీవుడ్ మూవీ కానుందా, లేక పుష్ప ఫ్రాంఛైజీస్‌లో సుకుమార్ తెరకెక్కించనున్న సినిమా కానుందా..అనేది మరికొద్ది రోజుల్లో క్లారిటీ రానుంది.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

2 weeks ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

2 weeks ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

4 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

1 month ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

1 month ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.