Latest News: అనంత విశ్వంలో ఎన్నో వేల కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. ప్రతి నక్షత్రానికి మనలానే నక్షత్ర మండలాలు ఉంటాయి. ఆ నక్షత్ర మండలాల్లోకి ప్రవేశించడం మానవమాత్రుడికి సాధ్యం కాని పని అని మన సనాతన ధర్మం చెబుతుంది. అలాగే శాస్త్ర సాంకేతిక విజ్ఞానం కూడా చెబుతుంది. అయినా కూడా ఆశాజీవి అయిన మనిషి సౌరకుటుంబంలోనే కాకుండా ఇతర నక్షత్ర మండలాల్లో భూమిని పోలిక గ్రహాలు ఉన్నాయేమో అనే విషయాలని తెలుసుకోవడానికి దశాబ్దాలుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అలాగే సౌర కుటుంబంలో ఉన్న ఇతర గ్రహాలలో మానవ సమాజం బ్రతకడానికి కావాల్సిన వాతావరణ పరిస్థితులు ఉన్నాయా అనే విషయాలని అంచనా వేస్తున్నారు. దీనికోసం చాలా దేశాలు ప్రయోగాలు చేస్తున్నాయి. లక్షల కోట్ల రూపాయిలు ఈ అంతరిక్ష ప్రయోగాలు, పరిశోధనల కోసం ఉపయోగిస్తున్నాయి.
అయితే ఇప్పటికి మానవ సమాజం నివసించడానికి పనికొచ్చే గ్రహాన్ని మాత్రం గుర్తించలేకపోయారు. అలాగే ఇతర గ్రహాలలో మనలాంటి జీవ ఉనికి ఉందేమో తెలుసుకోవాలని ట్రై చేస్తున్నారు అది కూడా సాధ్యం కావడం లేదు. కాని అప్పుడప్పుడు సౌర కుటుంబానికి కొన్ని కాంతి సంవత్సరాల దూరంలో భూమిని పోలిన గ్రహాలు ఉన్నాయని మాత్రం గుర్తిస్తున్నారు. ఇప్పుడు అలాంటి సూపర్ ఎర్త్ ని కూడా అంతరిక్ష శాస్త్రవేత్తలు గుర్తించారు. అమెరికాలో నాసా ఈ సూపర్ ఎర్త్ ని గుర్తించింది. ఈ సూపర్ ఎర్త్ భూమిని పోలి ఉండటంతో దీనిపై మానవ ఆవాసం సాధ్యం అవుతుందా అనే కోణంలో పరిశోధనలు చేశారు. సుమారు 200 వందల కాంతి సంవత్సరాల దూరం ఉంది. భూమి కంటే 1.8 రేట్లు పెద్దదైన ఈ సూపెర్ ఎర్త్ కి టీఓఐ-1075బీగా పేరు పెట్టారు. భూమి, శుక్రుడు, బుధ గ్రహాల తరహాలో రాతి ఉపరితలం ఉండటం ఈ గ్రహం ప్రత్యేకత.
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
Spirit Movie Release Date: స్పిరిట్ రిలీజ్ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగ..కానీ, ఆ విషయం మర్చిపోయాడా? అవును..తాజాగా ఈ…
MSG: మన శంకరవరప్రసాద్ గారు 4 రోజుల్లో మెగా రికార్డ్ సాధించారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ సినిమా కేవలం…
This website uses cookies.