Sunset: ప్రస్తుత రోజుల్లో చాలామంది ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. కష్టపడి డబ్బు సంపాదించినప్పటికీ చేతిలో డబ్బులు మిగలడం లేదని అదనంగా అప్పులు చేయాల్సి వస్తుందని బాధపడుతూ ఉంటారు. ఇక ఖర్చులు ఎంత తగ్గించుకున్నా కూడా ఏదో ఒక విధంగా డబ్బు మొత్తం ఖర్చు అవుతూ ఉంటుంది. ఇక డబ్బులు చేతులు మిగలడం కోసం రకరకాల పరిహారాలు పాటిస్తూ ఉంటారు. ఎన్ని రకాల పూజలు కూడా చేస్తూ ఉంటారు. అయినప్పటికీ ఆర్థిక సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. అటువంటప్పుడు మనం చేసే కొన్ని కొన్ని పనులు మనకు ఊరటనిస్తాయి.
ముఖ్యంగా సూర్యాస్తమయం సమయంలో కొన్ని రకాల పనులు చేయడం వల్ల ఆర్థిక సమస్యలు దూరం అవ్వడంతో పాటు అదృష్టం పట్టిపీడిస్తుంది. మరి సూర్యాస్తమయంలో ఎటువంటి పనులు చేయాలి అన్న విషయానికి వస్తే.. కొంత మందికి గ్రహచారం సరిగా లేక అదృష్టం కలిసి రాదు కొందరికి, మరి కొందరికి వాస్తు సరిగా లేక నష్టం జరుగుతుంది. ప్రతి పనిలో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అలాంటప్పుడు కొన్ని రకాల పరిహారాలు పాటించాలి. కాగా హిందు ధర్మంలో ఉదయ, సాయం లకు చాలా ప్రాధాన్యత ఉంది. వీటిని ప్రదోశ వేళలు అని అంటారు. ఈ సమయంలో చేసే శుభకార్యాలు లక్ష్మీ కటాక్షానికి కారణం అవుతాయని చెబుతారు. సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాల్లో తప్పకుండా సూర్య నమస్కారం చేసుకోవాలి.
ఇది సాకారత్మక శక్తి ప్రసారానికి దోహదం చేస్తుంది. అలాగే సాయంత్రం సమయంలో చేసే పూజకు చాలా మహత్తు ఉంటుంది. అదేవిధంగా సంధ్యా సమయంలో ఇంట్లోని పూజా మందిరంలో, తులసి ముందు దీపం వెలిగించాలి. సూర్యాస్తమయ సమయంలో అంటే సాయం సంధ్య వేళ ఇంట్లో దీపం వెలిగించి వెలుగును ఇంట్లోకి ఆహ్వానించాలి. ఇంట్లోకి చీకటి ప్రవేశించకుండా జాగ్రత్త పడాలి. ఒకసారి నెగెటివిటీ ఇంట్లో ప్రవేశిస్తే కష్టాల పరంపర మొదలవుతుంది. అది మనశ్శాంతి దూరం చేస్తుంది. ఆర్థిక నష్టాలు కలిగించవచ్చు. కాబట్టి ఇంట్లో చీకటి కాకుండా జాగ్రత్త పడడం అవసరం. సాయంత్రం సమయంలో నిద్ర పోవడం అసలు మంచిది కాదు.
సూర్యస్తమయం సూర్యోదయం సమయంలో నిద్ర ఏమాత్రం మంచిది కాదు. అందుకే ఉదయం సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలని పెద్దలు చెబుతుంటారు.సాయంకాలం వేళలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిద్రపోకూడదు. ఇలా పడుకుంటే లక్ష్మి అలిగి వెళ్లి పోతుంది. సంధ్యా లక్ష్మీని ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉండాలని శాస్త్రం చెబుతోంది. సూర్యాస్తమయ సమయంలో తప్పనిసరిగా పితృలను తలచుకొని వారి దీవెనల కోసం వేడుకోవాలట. ఇలా చెయ్యడం వల్ల వంశంలోని పూర్వీకుల దీవెనెల వల్ల జీవితంలో దురదృష్టం ఎదురుకాకుండా ఉంటుంది. జీవితం విజయపథంలో నడుస్తుందని నమ్మకం. కాబట్టి రోజు ఒకసారి పెద్దలను స్మరించుకొవడం వల్ల వారి దీవెనలు పొందవచ్చు. అందువల్ల కష్టాలు తీరిపోవచ్చు. కాబట్టి సాయంత్రం వేళలో పైన చెప్పిన పరిహారాలు పాటించడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి బయటపడడంతో పాటు లక్ష్మీ అనుగ్రహం పొందవచ్చు.