Summer Special Fruits: సాధారణంగా పండ్లు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఏ కాలంలో దొరికే పండ్లు ఆ కాలంలో నే తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ వేసవికాలంలో లభించే పుచ్చకాయ, మామిడిపండు వంటి ఎన్నో రకాల పండ్లు రుచికరంగా మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడ ఎంతో మంచివి. అలాగే ఈ వేసవికాలంలో లభించే పండ్లలో ఈతపండ్లు కూడా ఒకటి. వేసవిలో ఈత పండ్లు తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడు మనం వాటి గురించి తెలుసుకుందాం.
ఈత పండ్లలో గ్లూకోజ్, సుక్రోజ్, ప్రక్టోజ్ లు తక్షణ శక్తినిస్తాయి. వీటిని తినటం వల్ల శరీరానికి తక్షణ శక్తి అందించి వేసవిలో వచ్చే అలసట నుండి దూరం చేస్తుంది. ప్రతిరోజు ఉదయం ఈత పండ్లు జీర్ణశక్తి మెరుగు పడుతుంది. దీంతో అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలు పోతాయి. ఈత పండ్లలో ఐరన్ సంవృద్ధిగా ఉంటుంది. వీటిని తినటం వల్ల శరీరంలో రక్త శాతం కూడా పెరుగుతుంది. అలాగే రక్తప్రసరణ కూడా సక్రమంగా జరుగుతుంది.అలాగే ఎనిమియా సమస్యతో బాధపడేవారు ఈత పండ్లను తినడం వల్ల ఆ సమస్య నుంచి బయటపడవచ్చు.
Summer Special Fruits:
ముఖ్యంగా వేసవిలో దొరికే ఈ పండ్లను తినటం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది. వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అటువంటి సమయంలో ఈత పండ్లు తినడం వల్ల శరీర ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. అలాగే ఈత పనులు రోగనిరోధక గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇది ఆంటీబయాటిక్ గా పనిచేసే సీజనల్ వ్యాధులు దరిచేరకుండా కాపాడుతాయి. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈత పండ్లు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది.