Hair Fall: అమ్మాయిలు అయినా లేదా అబ్బాయిలైనా జుట్టు ఉంటేనే వారి అందం రెట్టింపు అవుతుంది. అందుకే జుట్టును కాపాడుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే కొన్ని కారణాల వల్ల చాలామంది జుట్టు రాలిపోయే సమస్యతో బాధపడుతూ ఉంటారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని చిట్కాలు ఉపయోగించిన జుట్టు రాలటాన్ని మాత్రం కంట్రోల్ చేయలేకపోతూ సతమతమవుతుంటారు. ఇలా అధికంగా జుట్టు రాలే సమస్య వెంటాడుతూ ఉన్నట్లయితే ఈ చిన్న చిట్కాని పాటిస్తే ఒత్తయిన జుట్టు మీ సొంతమవుతుంది.
ముఖ్యంగా జుట్టు రాలిపోవడానికి మన శరీరంలో విటమిన్స్ ఇతర పోషకాల లోపం ప్రధాన కారణం కావచ్చు అంతేకాకుండా బయట వాతావరణంలో ఏర్పడుతున్న కాలుష్యం దుమ్ము ధూళి కారణంగా కూడా జుట్టు రాలిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇలా జుట్టు రాలిపోయే వాళ్ళు ఎన్ని మందులు వాడిన తగ్గకపోతే ఈ సహజ చిట్కాలతో అందమైన, ఒత్తయిన జుట్టును మీ సొంతం చేసుకోవచ్చు.
కలబందలో ప్రోటోలైట్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది జుట్టును డ్యామేజ్ కాకుండా రిపేర్ చేసి డెడ్ సెల్స్ ని సైతం పునరుజ్జీవనం అందిస్తుంది. తద్వారా జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.గుడ్లలో సల్ఫర్, ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలకు ప్రోత్సహిస్తుంది. జుట్టు మందంగా పెరుగుతుంది. అందుకే ప్రతిరోజు మీ డైట్ లో గుడ్డు చేర్చడం వల్ల ఈ సమస్యకు చెట్ పెట్టవచ్చు. జుట్టు రాలే సమస్యకు ఉసిరి కూడా ఎఫెక్టీవ్ రెమిడీ. ఆమ్లాలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి ప్రోత్సహిస్తుంది. ఇలా ఈ సింపుల్ చిట్కాలతో జుట్టును పెంపొందించుకోవచ్చు.