Devotional Facts: సాధారణంగా మనం ఇంట్లో ఎన్నో రకాల విగ్రహాలను పెట్టుకొని పూజిస్తూ ఉంటాము అలాగే మరికొన్ని విగ్రహాలను ఇంట్లో అలంకరణ వస్తువులుగా కూడా పెట్టుకొని ఉంటాము కొన్ని కారణాలవల్ల అనుకోకుండా పొరపాటున ఆ విగ్రహాలు పగిలిపోవడం జరుగుతుంది. ఇలా విగ్రహాలు పగిలిపోవడం వల్ల చాలామంది ఎన్నో సందేహాలను వ్యక్తం చేస్తారు ఇలా విగ్రహాలు పగిలిపోవడంతో ఏదైనా చెడు జరుగుతుందా… చెడు జరుగుతుందని చెప్పడానికి సంకేతంగా ఈ విగ్రహం పగిలిపోయిందా అంటూ ఎన్నో రకాల సందేహాలను వ్యక్తం చేస్తుంటారు. మరి ఆకస్మాత్తుగా దేవుడు విగ్రహాలు లేదా ఇతర విగ్రహాలు పగిలిపోతే అర్థం ఏంటి అనే విషయానికి వస్తే…
ఈ విధంగా మన ఇంట్లో ఉన్నటువంటి విగ్రహాలు పగిలిపోతే చాలామంది దానిని పాజిటివ్ గానే తీసుకుంటారు ఇలా విగ్రహం పగిలిపోవడం వల్ల మన ఇంట్లో ఉన్నటువంటి ప్రతికూల శక్తి మొత్తం బయటకు వెళ్ళిపోతుందని భావిస్తూ ఉంటారు కానీ మరి కొందరు ఏదో కీడు జరగబోతుందని సందేహాలను వ్యక్తం చేస్తుంటారు. అయితే పగిలిపోయిన విగ్రహాలు ఇంట్లో ఉండటం వల్ల ఇంట్లో వారికి మంచే జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఇకపోతే ఇంట్లో పగిలిపోయిన విగ్రహాలు ఉంటే చాలా మంది వాటిని సరిచేసి పెడుతుంటారు అయితే ఇలా పెట్టడం వల్ల ప్రతికూల శక్తి మాత్రం ఇంట్లోకి వస్తుందని అందుకే వెంటనే పగిలిపోయిన విగ్రహాలు లేదా దేవుడి ఫోటోలు అద్దం వంటివి ఉంటే కనుక వెంటనే వాటిని బయటపడేయాలని చెబుతుంటారు అయితే ఈ విగ్రహాలను రోడ్డుకి ఇరువైపులా చెత్తకుప్పలోను పడేయకూడదు దేవుడి విగ్రహాలను ఎప్పుడూ కూడా గౌరవప్రదమైన ప్రదేశంలోనే పెట్టాలి అంటే ఏదైనా నీళ్లు పారుతున్నటువంటి నీటిలో నిమజ్జనం చేయడం లేదా దేవాలయాలలో పెట్టడం వంటివి చేయాలి కానీ ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు.