Vastu Tips: సాధారణంగా మనం మన జీవితంలో సంతోషంగా ఉండాలి అంటే తప్పనిసరిగా కొన్ని వాస్తు పరిహారాలను పాటించాల్సి ఉంటుంది. ఇలా వాస్తు పరిహారాలను పాటించడం వల్ల ఏ విధమైనటువంటి సమస్యలు లేకుండా ఇంటిల్లిపాది సంతోషాలతో ఉంటారని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు కూడా ఇంటి విషయంలో ఎన్నో వాస్తు పరిహారాలను పాటిస్తూ ఉంటారు. ముఖ్యంగా పూజ గదిలో ఈ మార్పులు కనక చేస్తే ఏ విధమైనటువంటి దోషాలు ఉండవు.
సాధారణంగా మన ఇల్లు డిజైనర్ ప్రత్యేకంగా డిజైనింగ్ చేసినప్పటికీ పూజ గది విషయంలో మాత్రం ప్రతి ఒక్కరి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. పూజ గది ఎల్లప్పుడూ కూడా ఈశాన్యంలో ఉండాలని భావిస్తారు. అయితే ఇల్లు మొత్తం మన సీలింగ్ చాలా ఎత్తులో వేయించుకుంటాము కానీ పూజ గదిలో మాత్రం సీలింగ్ తక్కువ హైట్ ఉండకూడదు అదేవిధంగా దేవుడి గదిలో ఎప్పుడు కూడా వెలుతురు ఉండేలా చూసుకోవాలి ఒకవేళ వెలుతురు లేకపోతే లైటింగ్ మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇక చాలామంది దేవుని గదిలో ఏదో మూలకో దేవుడు ఫోటోలు పెట్టి పూజిస్తుంటారు కానీ అలా చేయడం మంచిది కాదు దేవుడి ఫోటోలను ఎప్పుడూ కూడా మధ్యలో పెట్టి పూజించాలి. పూజ గదిలో ఇత్తడి వస్తువులను ఉంచవచ్చు.అలాగే పూజ గదిలో వెండి లేదా రాగి ఫ్రేమ్ తో తయారు చేసిన దేవుడు ఫోటో చిత్రాలను ఏర్పాటు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. దేవుడి గదిలో పొరపాటున కూడా ఇనుప వస్తువులను అసలు పెట్టకూడదు. ఇలా పూజగది విషయంలో ఈ పరిహారాలను పాటించడం వల్ల ఇల్లు మొత్తం పాజిటివ్ వైబ్రేషన్స్ కలిగి ఉంటాయి.