Sreeleela: తెలుగమ్మాయి అయినా బెంగుళూరులో ఎక్కువ గడిపింది 22 ఏళ్ళ కుర్రభామ శ్రీలీల. ‘పెళ్లి సందడి’, ‘ధమాకా’, ‘భగవన్ కేసరి’ చిత్రాలలో స్టార్ హీరోయిన్ రేంజ్ కి చేరుకుంది. దసరా పండుగ సందర్భంగా విడుదలైన ‘భగవంత్ కేసరి’ చిత్రం శ్రీలీలకి మంచి క్రేజ్ తెచ్చింది. ఈ సినిమా సక్సెస్ మీట్‌లలో ఫస్ట్ కిస్ గురించి యాంకర్ అడిగినప్పుడు శ్రీలీల ఎంతో డీసెంట్‌గా నేనిప్పటి వరకూ ఎవరికీ డైరెక్ట్‌గా లిప్ కిస్ పెట్టలేదు.
ఒకవేళ అలా పెట్టాల్సి వస్తే అది నా భర్తకే అంటూ చిలిపిగా ముద్దు ముద్దుగా సమాధానం చెప్పింది. ఈ మాట చెప్పిన తర్వాత సినీ లవర్, కామన్ ఆడియన్స్ అందరూ ఇప్పటి వరకూ శ్రీలీల నటించిన సినిమాలన్నీ ఓసారి తిరగేశారు. నిజమే, ఎక్కడా ఈ కుర్రభామ హీరోకి పెదవి ముద్దు పెట్టింది లేదు. దాంతో అవును ఈ బ్యూటీ చెప్పింది నిజమే. ఇకపై కూడా రొమాంటిక్ సీన్స్‌లో హీరోకి లిప్ కిస్ ఇవ్వడం జరగదులే.. అనుకున్నారు.
కట్ చేస్తే కొన్ని గంటల్లోనే శ్రీలీల దాచిపెట్టిన అసలు విషయం బయటపెట్టారు కొందరు నెటిజన్స్. తెలుగు కంటే ముందు శ్రీలీల ఓ కన్నడ సినిమాలో నటించింది. ఈ మధ్యనే తెలుగులో కూడా ఈ సినిమా రిలీజ్ అయింది. అందులో లవ్ ప్రపోజ్ చేసే ఓ సీన్ లో శ్రీలీల హీరో పెదవిపైన ముద్దు పెట్టింది. ఈ సీన్ ఇప్పుడు యూట్యూబ్ లో వైరల్ అవుతోంది. దీనిని స్క్రీన్ షాట్ తీసి నెటిజన్స్ సోషల్ మీడియాలో షేర్ చేసి ఓ ఆట ఆడుకుంటున్నారు. 2019లోనే శ్రీలీల ‘కిస్’ అనే కన్నడ సినిమా చేసింది.
ఈ సినిమాలో తన ఫస్ట్ లిప్ కిస్ హీరోకి పెట్టింది. తెలుగులో ఈ సినిమా ‘ఐ లవ్ యూ ఇడియట్’ అనే పేరుతో విడుదలైంది. దీన్నే ఇప్పుడు నెటిజన్స్ అందరికీ చూపిస్తున్నారు. ఇలా అడ్డంగా దొరికిపోతానని పాపం శ్రీలీల అనుకొని ఉండదని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ఆదికేశవ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో లీలమ్మో అనే పాట తాజాగా రిలీజై యూట్యూబ్‌లో బాగా ట్రెండ్ అవుతోంది. ఈ పాటలోని శ్రీలీల మాస్ స్టెప్పులకి ఆడియన్స్ హీటెక్కిపోతున్నారు.
ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…
Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…
Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…
Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…
Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…
This website uses cookies.