Ugadi 2023: మార్చి 22న తెలుగు నూతన సంవత్సరం మొదలు కాబోతుంది. శ్రీ శోభకృత్ నామ సంవత్సరంగా ఈ ఏడాది ఉండబోతుంది. తెలుగు లోగిల్లల్లో ఉగాదికి ప్రత్యేక స్థానం ఉంది. ఆంగ్ల క్యాలెండర్ ని మనం రెగ్యులర్ గా ఫాలో అయిన కూడా హిందూ మత విశ్వాసాల ప్రకారం గ్రహాలు, రాశులు, రాజయోగాలు, శుభాశుభ తిధులని ఫాలో అవుతూ ఉంటాము. ఇక ఈ ఏడాది మరో అద్భుతమైన కాలంగా ఉండబోతుంది. చంద్రుడు కూడా మీన రాశిలోకి ప్రవేశించి ఈ కొత్త సంవత్సరం లో ఒకే రాశిలో ఒకే సమయంలో బుధ, గురు, సూర్య, చంద్ర గ్రహాలు ఉండబోతున్నాయి. వందేళ్ళ తర్వాత ఈ రకమైన గ్రహాల సమయ కూడలి ఉండబోతుంది. దేనిని మహా సంయోగంగా పండితులు అభివర్ణిస్తున్నారు.
ఇక ఈ ఏడాదిలో మొత్తం నాలుగు శుభయోగాలు కలిసి రాబోతున్నాయి. గజకేసరి యోగం, నీచభంగ యోగం, బుధాదిత్య యోగం, హంసయోగం. ఈ యోగాల కారణంగా ప్రత్యేకంగా కొన్ని జన్మ రాశులకి శుభఫలితాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ నామసంవత్సరంలో శుభయోగ విశేషాలు ఉంటాయి. మరి ఏ రాశుల వారికి ఈ కాలంలో ఎక్కువ శుభయోగం ఉంటుందో చూసుకుంటే కన్యా రాశి మొదటి స్థానంలో ఉంటుంది. మహా సంయోగం, శుభయోగాల కారణంగా వీరి జీవితంలో అద్భుతాలు ఎన్నో ఆకస్మిక ధనలాభం ఉంటుంది.
వైవాహిక జీవితం బాగుంటుంది. జీవితంలో సంతోషాలు నిండుగా ఉంటాయి. అలాగే వృషభ రాశి వారికి కూడా శుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. ఆకస్మిక ధనలాభం కూడా ఉంటుంది. ఆర్ధిక పరిస్థితి ఊహించని విధంగా మెరుగుపడుతుంది. సమాజంలో మీ పట్ల ఆకర్షణ పెరుగుతుంది. ఆదాయానికి కొత్త మార్గాలు లాభాల్ని అందిస్తాయి. కుంభరాశి వారికి మహా సంయోగం కారణంగా జీవితంలో ఇంత కాలం ఎదురయ్యే కస్తాల నుంచి విముక్తి లభిస్తుంది. కొత్త ఉద్యోగాలు వస్తాయి. మితుల రాశి వారు కూడా ఉద్యోగోన్నతి పొందుతారు. వ్యాపారంలో ధనలాభం, ఆర్ధిక వృద్ధి పెరుగుతుంది.