Wed. Jan 21st, 2026

    Movies: ఈ మధ్యకాలంలో సినిమాలలో సాంగ్స్ సోషల్ మీడియాలో సెన్సేషన్ రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. పాట కొత్తగా ఉంటే ప్రపంచమంతా చుట్టేస్తుంది. దీనికి ఉదాహరణ పుష్ప సినిమాలోని సాంగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పొచ్చు. అలాగే మారి 2లో సాయి పల్లవి, ధనుష్ మీద చిత్రీకరించిన రౌడీ బేబీ సాంగ్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికి తెలిసిందే. ఈ సాంగ్ ఏకంగా వందకోట్లకి మందికి పైగా వీక్షించారు. ప్రస్తుతం 1.4 బిలియన్ వ్యూస్ తో యుట్యూబ్ లో ప్రపంచంలోనే అరుదైన ఘనతని సొంతం చేసుకుంది.

    ప్రపంచ వ్యాప్తంగా ఈ స్థాయిలో ఆదరణ పొందిన సాంగ్స్ వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. ఇండియన్ సాంగ్స్ కి ఆ స్థాయిలో ఫాలోయింగ్ ఉంది. ఇక ఈ ఏడాదిలో ఇప్పటి వరకు అత్యధిక ప్రజాదారణ పొందిన సాంగ్స్ లో టాప్ 5 జాబితా చూసుకుంటే అందులో మొదటి స్థానంలో బీస్ట్ మూవీ నుంచి అరబిక్ కుతూ సాంగ్ ఉండటం విశేషం. ఈ సాంగ్ ఇప్పటి వరకు 479 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకొని టాప్ ప్లేస్ లో ఉంది. దీని తర్వాత పుష్ప సినిమాలోని సామి సామి హిందీ వెర్షన్ సాంగ్ ఏకంగా 448 మిలియన్ వ్యూస్ తో రెండో స్థానంలో ఉంది.

    songs owned highest views in 2022

    దీని తర్వాత 328 మిలియన్ వ్యూస్ తో హిందీలో ఊ అంటావా సాంగ్ ఉండటం  విశేషం. ఈ సాంగ్ కూడా పుష్ప మూవీలోనిదే కావడం గమనార్హం. ఇక అత్యంత ప్రజాదరణ పొందిన సాంగ్స్ లో నాలుగో స్థానంలో మోహన్ భోగరాజు పాడిన ప్రైవేట్ ఆల్బం సాంగ్ అయిన బుల్లెట్టు బండి ఉండటం విశేషం. ఈ సాంగ్ ఏకంగా 319 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకుంది. దీని తర్వాత టాప్ 5 బ్లాక్ బస్టర్ సాంగ్ గా ఊ అంటావా తెలుగు సాంగ్ ఉంది. ఈ సాంగ్ ఏకంగా 304 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకొని రికార్డు సృష్టించింది.

    మొత్తానికి ఈ ఏడాదిలో అత్యంత ప్రజాదరణ పొందిన సాంగ్స్ జాబితాలో రెండు తెలుగు సాంగ్స్ ఉండటం విశేషం. అలాగే టాప్ 5 సాంగ్స్ జాబితాలో పుష్ప సినిమా నుంచి మూడు సాంగ్స్ ఉండటం అరుదైన రికార్డు అని చెప్పాలి. గతంలో అల వైకుంఠపురంలో సినిమా సాంగ్స్ ద్వారా కూడా అల్లు అర్జున్ యుట్యూబ్ లో ఇదే రకమైన ఫీట్ ని సొంతం చేసుకున్నాడు. ఇక ఈ ఏడాదిలో టాప్ 5 సాంగ్స్ జాబితాలో ఇవి ఉంటే వీటి తర్వాత స్థానంలో అరబిక్ కుతూ వీడియో సాంగ్ 6వ స్థానంలో, విశాల్ ఎనిమి మూవీలో తుమ్ తుమ్ సాంగ్ ఏడో స్థానంలో సర్కారువారి పాట కళావతి సాంగ్ ఎనిమిదో స్థానంలో, డీజే టిల్లు సాంగ్ తొమ్మిదో స్థానంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు సాంగ్ 10వ స్థానంలో ఉండటం విశేషం.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.