Alaram: మనలో చాలామంది ఉదయం నిద్ర లేవాలి అంటే తప్పనిసరిగా అలారం పెట్టుకుని మరీ నిద్ర లేస్తుంటారు. మనం ఏ సమయానికి లేవాలో అలారం సెట్ చేసుకొని అదే సమయానికి లేస్తూ ఉంటాము అయితే కొన్నిసార్లు అలారం పెట్టుకుని నిద్రపోతున్నటువంటి సమయంలో మనం చేసే చిన్న చిన్న తప్పులు వల్ల ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అసలు అలారం పెట్టుకుని నిద్రపోతే ఎలాంటి ప్రమాదాలు ఏర్పడతాయనే విషయానికి వస్తే…
మనం ఇంత సమయానికి లేవాలి అని అలారం పెట్టుకుంటాము అయితే అదే సమయానికి అలారం మోగగా మనం మొదటగా కళ్ళు తెరిచి చూసేది ఏంటి అంటే స్నూజ్ బటన్ . చాలామంది అలారం మోగిన వెంటనే అలారం ఆఫ్ చేస్తే నిద్రలేవరు. అలారం మోగిన వెంటనే గాఢ నిద్రలో ఉన్నటువంటి మనం ఒక్కసారిగా టక్కున నిద్రలేచి స్నూజ్ నొక్కి మరి నిద్రపోతాము ఇలా నిద్రపోవడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
స్నూజ్ బటన్ ను నొక్కి మరలా నిద్రపోవడం వల్ల మన శరీరం స్లీప్ అప్నియా అనే స్థితిలోకి వెళ్తుంది. దీనికారణంగా మనం మరలా స్నూజ్ బటన్ ను నొక్కి నిద్రపోయినప్పటికి ఎటువంటి ఫలితం ఉండదు. అంతేకాకుండా ఇది మనపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది.దీంతో మనం ఆశించిన రిఫ్రెష్ లభించదు. మనం ఇంకా అలిసిపోయినట్లు అనిపిస్తుంది. అలాగే స్నూజ్ బటన్ ను నొక్కి మరలా నిద్రించడం వల్ల మన నిద్ర చక్కాలకు భంగం కలుగుతుంది. అదేవిధంగా రోజంతా మనకు చురుగ్గా ఉండలేము తొందరగా అలసిపోయాము అనే భావన కూడా కలుగుతుంది అందుకే అలారం విషయంలో ఈ తప్పులు అసలు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు.