Skin Allergies: సాధారణంగా చిన్నపిల్లలు చర్మం చాలా సున్నితంగా ఉంటుంది అయితే చిన్న పిల్లలలో ఎక్కువగా చాలామందికి స్కిన్ ఎలర్జీ వస్తూ ఉంటుంది. ఇలా మృదువైన చర్మం పై స్కిన్ ఎలర్జీ రావడంతో పిల్లలు ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు.ఇలా చిన్న పిల్లల చర్మంపై తరచూ ఈ విధమైనటువంటి ఇబ్బందులు కనుక తలెత్తుతూ ఉంటే అందుకు ప్రధాన కారణాలు ఇవే కావచ్చు…
ముఖ్యంగా చిన్నపిల్లల్లో చర్మంపై ఎర్రటి మచ్చలు, దద్దులు వచ్చి దురద సమస్యతో ఎక్కువగా బాధపడుతుంటారు. కొందరిలో దురద సమస్య మరి ఎక్కువగా ఉండటం వల్ల గోళ్లతో గోకడం వల్ల గాయమై రక్తస్రావం కూడా కలుగుతుంది. సాధారణంగా ఇలాంటి సమస్య ఎక్కువగా వేసవికాలంలోనూ శీతాకాలంలో కూడా ఉంటుంది. వందమందిలో పది మంది ఈ సమస్యతో బాధపడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యపై తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే తీవ్రమైన చర్మ సమస్యగా మారే ప్రమాదం ఉంది.
పిల్లల్లో పోషకాహార లోపం వల్ల వ్యాధి నిరోధక శక్తి తగ్గడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతుంటాయి. ఎగ్జిమా చర్మ సమస్యకు ప్రధాన కారణం చర్మం పై పొరల్లో పిలాగ్రీన్ అనే ప్రోటీన్ లోపించడమే ఈ చర్మ సమస్యకు ప్రధాన కారణమని చెబుతున్నారు చర్మంలో ఈ ప్రోటీన్ లోపిస్తే త్వరగా తేమను కోల్పోయి పొడి చర్మం గా మారుతుంది దానికి తోడు వాతావరణ మార్పులు కారణంగా తీవ్ర సమస్యగా తలెత్తి పిల్లలకు కాళ్లు, చేతివేళ్లు,భుజాలు, ముఖం, నడుము భాగం తదితర భాగాల్లో చర్మం పొడిబారి తీవ్రమైన దురద వస్తుంది. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా పోషకాహారాన్ని అందిస్తూ తరచూ మాయిశ్చరైజర్ రాయడం అలాగే ఎక్కువ ఘాడత కలిగిన సోపు ఉపయోగించకపోవడం మంచిది.
Puranapanda Srinivas : హైదరాబాద్, మే 2: పవిత్ర సంకల్పాలు బలంగా నెరవేరడానికి మహాగణపతి మంగళానుగ్రహం తప్పని సరిగా ఉండాలని,…
PURANAPANDA SRINIVAS : జంట నగరాలుగా భారతదేశంలో ప్రఖ్యాతి గాంచిన హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో సుమారు ఆరు దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర…
Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా 'పెద్ది'. శ్రీరామనవమి పండుగ సందర్భంగా…
Sreeleela: టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీలకు షూటింగ్ సమయంలో ఒక చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల ఆమె షూట్ ముగిసిన…
Nagababu : శ్రీరామచంద్రుడన్నా , ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…
Tollywood : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ మూవీ 'సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్'.…
This website uses cookies.