Singer Sunitha: నన్ను మోసం చేసింది వాళ్ళే..అంటూ ప్రముఖ గాయని సునీత ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. గుంటూరుకి చెందిన సునీత చాలా చిన్న వయసులోనే పెళ్లి చేసుకుంది. గాయనిగా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పుడు ఎన్నో అవమానాలు భరించాల్సి వచ్చింది. ఇక్కడ అంత త్వరగా ఎవరికీ అవకాశాలు రావనే విషయం అందరికీ తెలిసిందే. సునీత విషయంలో కూడా అదే జరిగింది.
పాట పాడటం కోసం ఎంతో మంది సంగీత దర్శకులని కలిసింది. కానీ, అప్పట్లో చాలామంది నీ గొంతు బాగోదు..నువ్వు పాట ఎలా పాడతావు..అంటూ ఎగతాళి చేశారట. బొంగురు గొంతుతో పాట పాడితే వినేదెవరూ అంటూ హేళన చేశారట. అయినా కూడా తనపై తనకున్న నమ్మకంతో పట్టుదలతో ప్రయత్నాలు ఆపకుండా పాట పాడే ఛాన్స్ కోసం సంగీత దర్శకులు, రికార్డింగ్ స్టూడియోల చుట్టూ తిరిగింది.
Singer Sunitha: ప్రముఖ సంగీత దర్శకులూ, హీరోలు, సింగర్స్ అందరూ సునీతకి ఫ్యాన్స్
మొత్తానికి గులాబి సినిమాలో ఈ వేళలో నీవు ఏంచేస్తు ఉంటావో అనే పాట పాడే అవకాశం అందుకుంది. ఈ పాటకి కొన్ని కోట్లమంది అభిమానులున్నారు. ప్రముఖ సంగీత దర్శకులూ, హీరోలు, సింగర్స్ అందరూ సునీతకి ఫ్యాన్స్ అయ్యారు. ఆ తర్వాత ఇప్పటివరకూ సునీత గాయనిగా వెనక్కి తిరిగి చూడాల్సిన పరిస్థితి ఎదురవలేదు. పాట విషయంలో అవమానించిన వారే ఇపుడు ఆమె పాటకి అభిమానులుగా మారారు.
ఇక వ్యక్తిగత జీవితంలో భర్త తోడు లేకుండా 20 ఏళ్ళు గడిపింది. ఈ 20 ఏళ్ళలో ఎన్నో అవమానాలు..ఇద్దరు పిల్లలను పెంచే బాధ్యత..మానసిక ఒత్తిడి..అన్నిటినీ తట్టుకుంది. ఇలాంటి సమయంలో కూడా తను అనుకున్నవారే మోసం చేయడం ఆర్థికంగా, మానసికంగా కృంగతీయడం చేశారు. అవన్నీ తట్టుకొని నిలబడింది. ఇప్పుడు మ్యాంగో మూవీస్ సీఈవో రామకృష్ణ వీరపనేని ని పెళ్లి చేసుకొని హ్యాపీగా గడుపుతోంది.