Health Tips: ప్రతిరోజు మన ఆహారంలో భాగంగా సరైన స్థాయిలో విటమిన్స్ ప్రోటీన్స్ ఉన్నటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడం ఎంతో మంచిదని నిపుణులు చెబుతుంటారు కానీ మనం తీసుకునే ఆహారం కేవలం రుచి కోసం తింటున్నాము తప్ప పోషక విలువలు కలిగినటువంటి ఆహార పదార్థాలను తినడం లేదు. అయితే మనం ఎక్కడికి వెళ్లినా మన వెంట తీసుకుని వెళ్లి ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఒకటి ఉంది అదే బాదంపప్పు. ప్రతిరోజు నాలుగు బాదం పప్పులను నానబెట్టుకుని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అనే సంగతి మనకు తెలిసిందే.
ఇలా నానబెట్టుకొని తిన్నటువంటి బాదంపప్పు వల్ల మనకు ప్రోటీన్ ఫైబర్ తో పాటు మెగ్నీషియం విటమిన్ ఈ పుష్కలంగా లభిస్తాయి. వీటిని తరచూ తినడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది అదేవిధంగా మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది. . ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉన్నటువంటి బాదం పప్పును పొరపాటున కూడా కొంతమంది తినకూడదని నిపుణులు చెబుతున్నారు మరి ఎవరు తినకూడదు అనే విషయానికి వస్తే…
మైగ్రేన్ తలనొప్పితో బాధపడేవారు బాదంపప్పును అసలు తినకూడదు ఇందులో ఎక్కువ శాతం విటమిన్ ఈ పుష్కలంగా లభిస్తుంది అందుకే తలనొప్పి సమస్య మరింత అధికమయ్యే సూచనలు ఉంటాయి కనుక మైగ్రేన్ తలనొప్పితో బాధపడేవారు బాధ పప్పు తినకపోవడం మంచిది. వీటితోపాటు కిడ్నీ సమస్యలతో బాధపడే వారు కూడా బాదం.పప్పుకు దూరంగా ఉండాలి ఇందులో ఉన్నటువంటి ఆక్సలైట్ కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి కారణం అవుతుంది. అధిక శరీర బరువు ఉన్నవారు అలాగే జీర్ణాశయ సమస్యలతో బాధపడే వారు కూడా బాదం పప్పును తీసుకోకూడదు వీటితోపాటు దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతూ మందులు వాడే వారు కూడా తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు.