Tue. Jan 20th, 2026

    Shruti Haasan : ఏజ్ పెరుగుతున్నా సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు తలైవా. ప్రస్తుతం రజనీకాంత్ తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ క‌న‌గరాజ్ డైరెక్షన్ లో 171వ చిత్రం చేస్తున్నారు. ఈ మూవీలో రజనీకాంత్ అంతకు మించి పెర్ఫార్మెన్స్ ఇస్తారని టాక్ వినిపిస్తోంది. ఇదీ లోకేష్ మార్క్ సినిమా అని తెలుస్తోంది. ఈ సినిమాలో రజనీకాంత్ గోల్డ్ స్మ‌గ్ల‌ర్ గా నటిస్తున్నారు. ఇప్ప‌టికే రిలీజైన అయిన లుక్ సినిమాపై అంచ‌నాలు పెంచేశాయి. ఈ సినిమాతో ర‌జ‌నీ ఇమేజ్ ని అంత‌కంత‌కు రెట్టింపు చేసేందుకు లోకేశ్ తన టాలెంట్ ను చూపిస్తున్నాడట. ఇక ఈ మూవీలో హీరోయిన్ ఎవరన్నది ఇంకా క్లారిటీ రాలేదు. అసలు హీరోయిన్ ఉంటుందా? ఉండదా అన్న సస్పెన్స్ కూడా ఉంది? లోకేష్ సినిమాలంటే కంటెంట్ మాత్రమే కింగ్ కాబ‌ట్టి హీరోయిన్ ఉన్నా? లేక‌పోయినా? నో వర్రీస్ అని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. అయితే తాజాగా ఈ మూవీ నుంచి ఓ అప్ డేట్ వచ్చింది. ఈ చిత్రంలో సౌత్ టాప్ హీరోయిన్ శృతిహాసన్ నటిస్తోందన్న వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది.

    shruti-haasan-will-play-as-rajinikanth-daughter-in-lokesh-kanakaraj-movie
    shruti-haasan-will-play-as-rajinikanth-daughter-in-lokesh-kanakaraj-movie

    ఈ సినిమాలో హీరోయిన్ ఉందో లేదో తెలియదు కానీ రజనీకాంత్ కు ఓ కూతురు ఉంటుందట . ఈ క్యారెక్టర్ మూవీలో కీలకంగా ఉంటుందని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అందుకే స్టార్ బ్యూటీ శృతి హాసన్ ను ఈ క్యారెక్టర్ కోసం లోకేశ్ సెలెక్ట్ చేశారంటూ ఓ న్యూస్ చెక్కర్లు కొడుతోంది. అదే జరిగితే శృతిహాస‌న్ కొత్త కోణం ఈ మూవీలో చూడొచ్చని ఫ్యాన్స్ ఎక్స్‎పెక్ట్ చేస్తున్నారు. ఇప్ప‌టికే హీరోయిన్ గా తనను తాను ప్రూవ్ చేసుకున్న శృతి ఐటం భామ‌గానూ అలరించింది. ఇప్పుడేమో కూతురి పాత్రకు ఎస్ చెప్పిందంటే మరోసారి తన ప్రతాపాన్ని చూపించేందుకు రెడీ అయినట్లేనని అంటున్నారు. దీంతో అమ్మడికి ఆఫర్స్ కూడా ఓ రేంజ్ లో వస్తాయని అంచనా వేస్తున్నారు.

    shruti-haasan-will-play-as-rajinikanth-daughter-in-lokesh-kanakaraj-movie
    shruti-haasan-will-play-as-rajinikanth-daughter-in-lokesh-kanakaraj-movie

    ఇక ఈ ప్రాజెక్టుకు శృతి కూడా ఓకే చెప్పేందుకు ఛాన్సులు ఎక్కువగా కనిపిస్తున్నాయని టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే ఈ మధ్యనే శృతి లోకేష్ తో క‌లిసి ఓ మ్యూజిక్ వీడియో చేసింది. ఇక ఈ వీడియోలో ఇద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ వావ్ అనిపించింది. లోకేష్ తో ఇలాంటి వీడియో చేస్తుంద‌ని ఎవరూ ఉహించలేదు. ఈ వీడియోకు సంబంధించిన చిన్న న్యూస్ కూడా బయటకు రాకుండా చాలా జాగ్ర‌త్త‌ప‌డ్డారు. ఆ ర‌కంగా ఇద్దరి ఫ్యాన్స్ ఒక్కసారిగా స‌ర్ ప్రైజ్ ఫీల్ అయ్యారు. ఇక అప్ప‌టి నుంచి వీరిద్దరి మ‌ధ్య మంచి ర్యాపో క‌నిపిస్తుంది. ఇక రజనీకాంత్ మూవీతో లోకేష్ యూనివ‌ర్శ్ లోకి శృతిహాస‌న్ ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే కాదు వీరిద్దరూ క‌లిసి మ‌రిన్ని అద్బుతాలు చేయ‌డానికి ఛాన్సులు లేక‌పోలేదు.