Shriya Saran : అందరికీ ఏజ్‌తో పాటు అందం తరుగుతూ ఉంటుంది . కానీ శ్రియకు మాత్రం రివర్స్‌లో ఏజ్‌తో పాటు గ్లామర్ కూడా అదే స్థాయిలో రోజు రోజుకు పెరుగుతోంది. 40 ఏళ్ల వయసు దాటినా ఓ బిడ్డకు తల్లైన తర్వాత కూడా ఈ భామలో హాట్ నెస్ తగ్గలేదు. ఇప్పటికీ అందాలు అరబస్తూ హాట్ ఫోటో షూట్స్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది.
శ్రియా భారతీయ వినోద పరిశ్రమలో ఉన్న అత్యంత అందమైన, ప్రతిభావంతురాలైన నటి. దక్షిణ ప్రాంతీయ వినోద పరిశ్రమలో తన కెరీర్ ప్రారంభించి స్టార్ హీరోయిన్ గా అంచలంచెలుగా ఎదిగింది. సుమారు 20 ఏళ్లుగా తన కెరీర్ లో ముందుకు దూసుకెళ్తూ నటనతో అందంతో సినీ ప్రేక్షకుల హృదయాలను దోచుకుంటోంది బ్యూటీ.. శ్రియా దేశవ్యాప్తంగా ఉన్న తన అభిమానుల నుండి విపరీతమైన ప్రేమను, ఆప్యాయతలను సాధించింది.
నటి శ్రియా తన సాహసోపేతమైన ఫ్యాషన్ ఎంపికలకు ప్రసిద్ధి చెందింది. తాజాగా రిస్క్ అవుట్ ఫిట్ ధరించి ఫోటోలు దిగి ఇంటర్నెట్‌లో మంటలు రేపింది. ఈ అవుట్ ఫిట్ లో ఓ రేంజ్ లో అందాలను ప్రదర్శించింది శ్రియా. డీప్ నెక్ లైన్ థైస్ దగ్గర డీప్ కట్స్ కలిగిన ఈ అవుట్ ఫిట్ ధరించడంతో నెటిజన్స్ అంతా ఒక్కసారిగా ఆవకాయ్యారు. శ్రీయను నెట్టింట్లో తెగ పొగిడేస్తున్నారు.
ఫ్యాషన్ డెజైనర్ కు చెందిన డిజైనర్ అవుట్ ఫిట్ లో మెరిసిపోయింది. ఈ డెజైనర్హౌస్ నుంది వచ్చిన రెడ్ కలర్ అవుట్ ఫిట్ వేసుకుని అందరి దృష్టిని ఆర్షించింది. ఈ డ్రెస్‌లో అద్భుతంగా కనిపించింది. ఆమె ఫ్యాషన్ ఎంపిక చాలా మంది దృష్టిని ఆకర్షించింది.
ఫ్యాషన్ డిజైనర్ సుకృతి గ్రోవర్ శ్రీయ కు అద్భుతమైన లుక్స్ ను అందించింది. అవుట్ ఫిట్ కు సెట్ అయ్యే జ్యువెలరీ మినరేలి స్టోర్ నుంచి సెలెక్ట్ చేసింది. మేకప్ ఆర్టిస్ట్ మహేంద్ర ఆమె అందాలకు మెరుగులు దిద్దగా, హెయిర్ స్టైలిస్ట్ అందమైన హెయిర్ ను అందించింది.
శ్రియా శరణ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫాన్స్ ను పలకరిస్తూ ఖుషి చేస్తూ ఉంటుంది. అందమైన ఫోటోషూట్లతో అదిరిపోయే లుక్స్ లో కనిపించి తన అందాలతో అందరి హృదయాలను దోచేస్తుంది శ్రియా. తాజాగా వేసుకున్న డ్రస్ లోనూ కుర్ర హీరోయిన్ లకు పోటీ వస్తోంది.