Shani Dosham: దేశవ్యాప్తంగా ఎంతో మంది భక్తులు ఆలయానికి వెళ్లిన సమయంలో తప్పనిసరిగా కొబ్బరికాయలు తీసుకెళ్లి భగవంతుడికి సమర్పిస్తూ ఉంటారు. ఇలా కొబ్బరికాయ కొట్టడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని భావిస్తుంటారు. అయితే శని దోషంతో బాధపడేవారు కొబ్బరికాయతో ఇలా చేస్తే తప్పనిసరిగా శని దోషం నుంచి విముక్తి పొందవచ్చు. మరి శని దోషం తొలగిపోవాలంటే కొబ్బరికాయతో ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయానికి వస్తే…
శని దోష ప్రభావ కారణంగా ఎంతో మంది ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. ఇలాంటి ఇబ్బందులను అధిగమించాలి అంటే తప్పనిసరిగా శని దోష పరిహారాలు చేయడం ఎంతో అవసరం. అయితే ఈ శని దోషంతో బాధపడేవారు శనివారం ఏదైనా ఆలయానికి వెళ్లి అక్కడ కొలనులో కొబ్బరికాయను సమర్పించడం వల్ల ఈ శని దోషం నుంచి బయటపడవచ్చు అదేవిధంగా ఈ కొబ్బరికాయలు పగలగొట్టి ఒక దానిలో చక్కెర నింపి భద్రపరచడం వల్ల శని దోషం నుంచి రాహు కేతు దోష పరిహారాలు కూడా తొలగిపోతాయి.
Shani Dosham:
ఇక ఆర్థిక సమస్యలతో బాధపడేవారు కూడా కొబ్బరికాయను ఒక ఎర్రటి వస్త్రంలో చుట్టి దానిని ఎవరికి కనిపించకుండా డబ్బు దాచే చోట పెట్టడం వల్ల ఈ ఆర్థిక సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు. ఇలా కొబ్బరికాయతో ఈ విధమైనటువంటి పరిహారాలు చేయటం వల్ల ఈ సమస్యల నుంచి విముక్తి పొందవచ్చని పండితులు చెబుతున్నారు.