Sara Ali Khan : బాలీవుడ్ మోస్ట్ ఎనర్జిటిక్ హీరోయిన్ సారా అలీ ఖాన్ ప్రస్తుతం వెకేషన్ మూడ్‌లో ఉంది. ఈ భామ హాయగా ఎలాంటి టెన్షన్స్ లేకుండా విదేశాల్లో విహరిస్తోంది. తాజాగా తన విహారయాత్రకు సంబంధించిన చిత్రాలను తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ లో పంచుకుంది ఈ బ్యూటీ. ఆస్ట్రేలియాలోని బీచ్‌లో భారతీయ సంప్రదాయ దుస్తులైన సల్వార్ కమీజ్ ధరించి బోల్డ్ ఫోజులు ఇస్తూ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు పోస్ట్ చేసిన 3 గంటల్లోనే 5 లక్షల 48 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. అదే సమయంలో 2500పైగా కామెంట్స్ ఇన్‌బాక్స్‌లో పోస్ట్ అయ్యాయి.
చిత్రాలను పంచుకుంటూ, సారా అలీ ఖాన్, ప్రాంతం మారవచ్చు కానీ సూర్యుడు కాదు అని ఈ పిక్స్‌కు క్యాప్షన్‌ను జోడించింది. చాలా మంది ఇన్‌స్టా ఫాలోవర్స్ ఆమె చిత్రాలపై అందంగా ఉన్నావని, అందమైన యువరాణి అని కామెంట్స్ చేశారు. వైట్ కలర్ షరారా సెట్ వేసుకుని ఎంతో హాట్ గా కనిపించింది సారా. ఈ పిక్స్ లో తన హెయిర్ ను లూజ్‌గా వదులుకుని , లైట్ మేకప్ వేసుకున్న సారా విభిన్న స్టైల్స్ లో బోల్డ్ పోజులు ఇస్తూ కనిపించింది. ఈ పిక్స్ అన్నీ కూడా ఆమె అభిమానులను అమితంగా ఆకట్టుకున్నాయి.
27 ఏళ్ పంజాబీ బ్యూటీ సారా అలీ ఖాన్‌కు ట్రావెలింగ్ అంటే చచ్చేంత ఇష్టం. అందుకే ఈ చిన్న ఏజ్‌లోనే అనేక కొత్త ప్రదేశాలను సందర్శించింది. ఏ కొత్త ప్రదేశానికి వెళ్లినా ఈ చిన్నది తన తల్లి , సోదరుడితో కలిసే ట్రావెల్ చేస్తుంది. నటి ప్రస్తుతం ఆస్ట్రేలియాలో విహారయాత్ర చేస్తోంది.
ఆస్ట్రేలియాలోని సిడ్నీ నుంచి పోస్ట్ చేసిన తాజా చిత్రాలలో సారా అలీ ఖాన్ చాలా అందంగా కనిపించింది. సారా పూర్తిగా నేవీ బ్లూ ఎంబ్రాయిడరీతో అందంగా డిజైన్ చేసిన తెల్లటి కాటన్ షరారా సెట్ లో ఆకర్షణీయంగా కనిపించింది. ఈ షరారా సూట్‌కు జోడీగా నెట్ దుపట్టాను వేసుకుని మరింత అట్రాక్టివ్ గా కనిపించింది.
ఈ మధ‌్యకాలంలో సారా అలీ ఖాన్ చివరగా అత్రంగి రే చిత్రంలో కనిపించింది. ఇందులో అక్షయ్ కుమార్, ధనుష్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సో సోగా ఆడినా అమ్మడి పెర్ఫార్మెన్స్ అందరికి బాగా నచ్చింది.
సారా అలీ ఖాన్ తరచుగా జిమ్ వెలుపల కనిపిస్తూ అలరిస్తుంటుంది. ఆమె తన శరీరాకృతిని కాపాడుకోవడానికి చాలా కష్టపడి వర్కౌట్‌లు చేస్తుంది. ఈ రోజుల్లో ఈ భామ కు శుభమాన్ గిల్ కు మధ్య ఏదో ఉందని సోషల్ మీడియాలో గాసిప్ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఇద్దరూ ఇప్పటి వరకు ఈ విషయాన్ని ఇంకా ధృవీకరించలేదు, అయితే ఇద్దరూ చాలా సందర్భాలలో కలిసి కనిపించారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.