Sandal wood Oil: పురాతన భారతీయ ఆయుర్వేద వైద్యం లో గంధపు నూనెకు చాలా ప్రాముఖ్యత ఉంది. సువాసన భరితమైన గంధపు నూనె మిశ్రమాన్ని అనేక బ్యూటీ ప్రొడక్ట్స్ లో ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు. గంధపు నూనెలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ మైక్రోబియన్ గుణాలు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, విటమిన్ ఈ, సెస్క్విటెర్పెనెస్ అని పిలిచే సహజమైన రసాయన సమ్మేళనాలను సమృద్ధిగా కలిగి ఉండడంతో దీనికి అంతర్జాతీయంగా విపరీతమైన డిమాండ్ కూడా కలదు. గంధపు నూనెతో చర్మ సౌందర్యం మెరుగుపడడమే కాకుండా మానసిక ఒత్తిడి, చికాకు, ఆందోళన, నిద్రలేమి, డిప్రెషన్ వంటి మానసిక రుగ్మతలకు కూడా చక్కటి పరిష్కార మార్గాన్ని చూపిస్తుంది.
గంధపు నూనె ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.చర్మ సమస్యతో బాధపడేవారు గంధపు నూనెను ఉపయోగిస్తే ఇందులో ఉండే విటమిన్ ఈ, శక్తివంతమైన ఆక్సిడెంట్లు,యాంటీ సెప్టిక్ గుణాలు, యాంటీ ఏజింగ్ గుణాలు ఫ్రీరాడికల్స్ ను తొలగించి చర్మం లోని మృత కణాల సంఖ్యను తగ్గించి చర్మానికి సహజ సౌందర్యాన్ని ఇవ్వడంలో సహాయపడుతుంది. అలాగే చర్మంపై వచ్చే మచ్చలు, ముడతలు, కంటి కింద నల్లని వలయాలు, వృద్ధాప్య ఛాయాలను అరికట్టడంలో సహాయపడుతుంది.గంధపు నూనెలో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, సహజ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు శరీరం లోని ఫ్రీ రాడికల్స్‌ను తొలగించి ఆక్సీకరణ నష్టాన్ని తగ్గిస్తుంది.
మానసిక ఒత్తిడి, నిద్రలేమి సమస్య, ఆందోళన వంటి సమస్యలతో బాధపడేవారు మీరు మీ చీలమండలు, మణికట్టు మీద గంధపు నూనెను రుద్ది నేరుగా పీల్చడం ద్వారా నూనెలోని వెచ్చని, రిఫ్రెష్ సువాసన మీ మనస్సును శాంతింపజేయడంలో సహాయపడి మానసిక ఒత్తిడిని తగ్గించి మెదడు చురుకుదనాన్ని పెంచుతుంది. ఇలా ఈ గంధపు నూనె కేవలం చర్మ సౌందర్యాన్ని పెంపొందించడమే కాకుండా మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో కూడా ఎంతో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పాలి.